iDreamPost
android-app
ios-app

కేంద్రం ఫోటో సరే…. మరి కేంద్ర నిధుల మాటేంటి…

కేంద్రం ఫోటో సరే…. మరి కేంద్ర నిధుల మాటేంటి…

ఏపీలో పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలలో ప్రధాని మోడీ ఫొటో ఉండాలన్న వ్యాఖ్యలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ ప్రాంతంలో ఈ పర్యటనలో భాగంగా పంచాయతీ పరిధిలో ఉండే బంగారయ్య పేటలో ఉన్న రేషన్ డిపోలో మోడీ ఫోటో లేకపోవడంతో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధుల ఖర్చుతో చేపట్టే పథకాలపై మోడీ ఫోటో తప్పకుండా ఉండాలని ఆదేశించారు.

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పేదవాడికి అందించే బియ్యం పంపిణీ మీద కేంద్రం తమ ఫోటో వేసుకోని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దురదృష్టకరం అని ఏపీ నేతలు విమర్శిస్తున్నారు. రేషన్ బియ్యం 31.67 పైసలు పడుతుండగా కేంద్రం వాటా 29.67 పైసలు, రాష్ట్రం వాటా 2రూపాయలు, లబ్ది దారులు ఒక్క రూపాయి చెల్లిస్తున్నారు. కరోనా సమయం నుండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కింద పేదలకు 5కిలోల ఉచిత బియ్యం కేంద్రం అందిస్తుంది..

కేంద్రం ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో బీజేపీని ప్రచారం చేసుకోవడానికే పేదవాడికి అందించే బియ్యం మీద మోడీ ఫోటో వేయాలనుకుంటుందని విమర్శిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాల మీద మోడీ ఫోటో ఉండాలి కానీ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కూడా సరైన విధానం అవలంబించాలి. కరోనాతో ఆర్థిక భారాన్ని మోస్తున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూత అందించాలి. కేంద్రం ద్వారా వచ్చే నిధులను విడుదల చేయాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన కేంద్రం స్పందన సరిగా లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : కృష్ణా జలాల వివాదం.. తెలంగాణ ఏం కోరుకుంటోంది..?

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ ఇంకా పూర్తికాలేదు. కేంద్రం ఆలస్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. కొత్త రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చిన మోడీ మట్టి, నీళ్లు తప్ప ఎం ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.15వ ఫైనాన్స్ కమిషన్ సిపార్సుల మేరకు డేవల్యూషన్ ఫండ్ ను 41 శాతానికి పెంచిన కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధుల శాతాన్ని తగ్గించారు. కేంద్ర రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపకూడదు. కానీ కేంద్రం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంతో కేంద్రం నుండి వచ్చే నిధుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు నిధుల విడుదల కోసం ఢిల్లీకి వెళ్లి ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన ,ఎన్ని లేఖలు రాసిన రాష్ట్రానికి రావాలిసిన నిధుల విషయంలో కేంద్రం వైఖరి మారడం లేదు.

చమురు సంస్థల మీద కేంద్రం అజమాయిషీ లేకపోవడంతో రోజురోజుకు పెరుగుతున్న ఆయిల్ రేట్ల మీద పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు దక్కకుండా సెస్ రూపంలో కేంద్రం అధిక ఆదాయం పొందుతుంది. ఆర్థిక భారంతో నడుస్తున్న ప్రభుత్వాలకు కేంద్రం సాయం అందించక పోగా రుణాల పరిమితి మీద ఆంక్షలు విధించింది. FRBM పరిమితి పేరుతో జీడీపీ లో 3శాతం మించి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాడనికి లేకుండా ఆంక్షలు విధించింది. ఇలా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం విషయంలో కేంద్రం మోకాలడ్డుతూ ఇప్పుడు రాజకీయ లబ్దికోసం రేషన్ మరియు కేంద్ర పథకాల మీద మోడీ ఫోటో అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పెండింగులో ఉన్నాయి. జీఎస్టీ లోటును కూడా కేంద్రమే భరిస్తామని తెలిపింది. పైకి రాష్ట్రానికి అన్ని చేస్తామని చెప్తున్నా చేతల్లో మాత్రం చెప్పినట్లు జరగడం లేదు. లోటు బడ్జెట్, కరోనాతో ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో సజావుగా సాగుతున్నాయి. దీన్ని జీర్ణించుకొని బీజేపీ రాజకీయంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని చూస్తుంది.

కేంద్రం అవలంబిస్తున్న వైఖరి మీద ప్రతిపక్ష టీడీపీ,జనసేన, బీజేపీలు పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రయోజలనాలకోసం కేంద్రాన్ని నిలదీయాలి. రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిన టీడీపీ నిధుల విషయంలో కేంద్రాన్ని నిలదీయక పోవడం శోచనీయం. పాలన కత్తిమీద సాము అయినా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని ఎంత కష్టమైన ముందుకు తీసుకు వెళ్తున్నారు.

ఇకనైనా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. ఆర్థిక భారంతో నడుస్తున్న రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలని అప్పుడు కేంద్రం ఫోటో తప్పనిసరిగా పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి.

Also Read : ఖాదీ సంగతి సరే.. ఉక్కు ఊపిరి తీసేస్తున్నారే!