iDreamPost
android-app
ios-app

కృష్ణుడి కోసం వెతుకులాట??.. అదిరిపోయిన నిఖిల్ ‘కార్తికేయ 2’ ట్రైలర్

  • Published Jun 24, 2022 | 7:44 PM Updated Updated Jun 24, 2022 | 7:44 PM
కృష్ణుడి కోసం వెతుకులాట??.. అదిరిపోయిన నిఖిల్ ‘కార్తికేయ 2’ ట్రైలర్

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. కృష్ణుడు ఎవరు అంటూ ద్వారకా నగరం కోసం హీరో వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. ట్రైలర్ లో అసలు కథ చెప్పకుండా జాగ్రత్త పడి కొన్ని షాట్స్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు దర్శకుడు.

కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు మించిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ట్రైలర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom