పదిహేనేళ్ల క్రితం యాంకర్ నుంచి హీరోయిన్ గా ప్రమోషన్ పొందిన స్వాతి రెడ్డి తక్కువటైంలోనే తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నప్పటికి పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేసేవాటిని మాత్రం వదులుకోకుండా మెప్పించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో సీనియర్ హీరో వెంకటేష్ తో పోటీ పడి మరీ ఆకట్టుకోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత కార్తికేయ, స్వామి రారా లాంటి డీసెంట్ హిట్స్ తన ఖాతాలో చాలానే ఉన్నాయి. స్వాతి చివరిసారిగా కనిపించిన సినిమాలు త్రిపుర, లండన్ బాబులు. వాటి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి.
రెండేళ్ల క్రితం పైలట్ వికాస్ తో పెళ్లయ్యాక వెండితెరకు దూరమైన స్వాతి త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడు రూపొందించే వెబ్ సిరీస్ కి దాదాపు అంగీకారం తెలిపినట్టు వినికిడి. అతను ఎవరు తదితర వివరాలు ఏమి తెలియవు. భర్త ఉద్యోగ రీత్యా ఇంతకాలం ఇండోనేషియాలో ఉన్న స్వాతి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. కరోనా వల్ల వెబ్ సిరీస్ లకు, ఇండిపెండెంట్ ఫిలింస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో స్వాతి లాంటి సీనియర్ ఆర్టిస్టుల కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
పరిచయం ఉన్న స్టార్లు నటిస్తే ఓటిటి కంటెంట్ కు మంచి డిమాండ్ వస్తుంది. ఎలాగూ ఖాళీగా ఉండటం ఎందుకని స్వాతి రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప ఇంకా పెద్ద హీరోల సినిమాలేవీ షూటింగులు మొదలుపెట్టుకోలేదు. డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు మాత్రం షూట్లు కానిచ్చేస్తున్నాయి. క్యాస్టూమ్స్ విభాగానికే పరిమితమైన చిరంజీవి కూతురు సుస్మిత కూడా దీంట్లో ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ కి సూచనగా చెప్పొచ్చు. అలాంటప్పుడు స్వాతి రెడ్డికి ప్రేక్షకులను పలకరించడానికి వెబ్ సిరీస్ కన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. కాకపోతే అఫీషియల్ నోట్ రావాలి