iDreamPost
iDreamPost
కథల కొరత మనకే కాదు బాలీవుడ్ ని కూడా విపరీతంగా వేధిస్తోంది. ఎంతగా అంటే పది పదిహేనేళ్ల క్రితం వచ్చిన సినిమాలను సైతం రీమేక్ చేసేలా. ఇటీవలే అక్షయ్ కుమార్ కాంచనని లక్ష్మిగా రీమేక్ చేయడం చూశాం. ఫలితం సంగతి పక్కనబెడితే తొమ్మిదేళ్ల వెనక వచ్చిన మూవీని ప్రత్యేకంగా ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ రోజు ఛత్రపతి రీమేక్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో అధికారికంగా ప్రకటించారు. ఇది 2005లో వచ్చిన బ్లాక్ బస్టర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిని కూడా హిందీలో పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.
నిజానికి ఊసరవెల్లి డిజాస్టర్ మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించినా ఫలితం దక్కలేదు. కానీ అదే పనిగా దీన్ని రీమేక్ చేయాలని పూనుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎప్పుడో దీని డబ్బింగ్ వెర్షన్ ఛానల్స్ లో యుట్యూబ్ నార్త్ జనం చూసేశారు. ,మరి ఇప్పుడు అంత స్పెషల్ గా ఏమని మార్పులు చేసి తీస్తారో వేచి చూడాలి. హీరో ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అక్షయ్ కుమారే గతంలో ఆసక్తి చూపించినా ప్రస్తుతం హీరో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదంతా సబ్జెక్టులు దొరక్క నిర్మాతలు పడుతున్న ఇబ్బందులను తేటతెల్లం చేస్తోంది. పక్కన కర్ణాటకలోనూ ఇలాంటివి చేస్తుంటారు. గ్యాంగ్ లీడర్, స్వాతిముత్యం లాంటి సినిమాలు దశాబ్దం తర్వాత రీమేక్ చేసుకున్న ట్రాక్ రికార్డు అక్కడ ఉంది. మనవాళ్ళేమో మలయాళం వెనుక పడుతుంటే బయటి ప్రొడ్యూసర్లు తెలుగు సినిమాలు పాతవి వెతికి మరీ రైట్స్ కొంటున్నారు. కొత్తగా కథలు తీసుకొస్తున్న ఔత్సాహిక దర్శక రచయితల మీద నమ్మకం లేకనో రిస్క్ ఎందుకు లెమ్మని భయపడి ఇతర బాషల మీద ఆధారపడటమో చెప్పలేం కానీ ఓటిటి విజృంభిస్తున్న వేళ పూరి జగన్నాధ్ అన్నట్టు కొత్త రైటర్లు పరిశ్రమకు చాలా అవసరం