iDreamPost
android-app
ios-app

సొంత పార్టీలోనే ట్రంప్‌కు ఎదురు దెబ్బ

సొంత పార్టీలోనే ట్రంప్‌కు ఎదురు దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతినిధుల సభకు నవంబరులో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్ వద్దన్న వ్యక్తులనే పార్టీ కార్యకర్తలు అభ్యర్థులుగా ఎన్నుకున్నారు.

నార్త్‌ కరోలినా స్థానానికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌… లిండా బెన్నెట్‌ అనే మహిళ పేరును ప్రతిపాదించగా కార్యకర్తలు మాడిసన్‌ కాథ్రోన్‌ అనే 24 ఏళ్ల యువకుడిని ఎన్నుకున్నారు. పోటీ చేయడానికి కనీస వయసు 25 ఏళ్లుకాగా, ఆగస్టు నెలలో వచ్చే పుట్టిన రోజుతో ఆయన ఈ అర్హత సాధించనున్నారు.

కెంటకీ స్థానానికి థామస్‌ మాస్సీని కార్యకర్తలు ఎన్నుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని మాస్సీ తరచూ విమర్శిస్తుండడంతో ఆయనను పోటీకి నిలబెట్టకూడదని ట్రంప్‌ ప్రతిపాదించారు. అయితే పార్టీ స్థానిక శ్రేణులు మాత్రం ఆయననే బలపరిచాయి.

నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ట్రంప్ ‌తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తన వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకు చైనా, డబ్ల్యుహెచ్ఓ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అమెరికాలో పెరిగిన నిరుద్యోగం నేపథ్యంలో హెచ్-1బి వీసాల‌ నిలిపివేత కోసం చట్టం తీసుకొచ్చి..ఉద్యోగాలు స్వదేశీయులకే అంటూ ప్రచారం చేస్తున్నాడు. అలాగే కరోనా వైరస్ కట్టడిలో పూర్తిగా విఫలమైన ట్రంప్..దాన్ని నుంచి దృష్టి మళ్లించేందుకు చైనా వైరస్ అంటూ ఆరోపణలు చేశారు.

ఇలా ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. ఇటివలి అమెరికాలో నల్ల జాతీయులు ఆందోళనను శాంతియుతంగా ఆపడంలో విఫలం అయినా ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను చవిచూశాడు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అన్ని వర్గాల ప్రజలనుంచే కాకుండా…ట్విట్టర్, పోలీసులు, ఆర్మీ నుంచి కూడా వ్యతిరేకతను, హెచ్చరికలను చవి చూశాడు. ఈ నేపథ్యంలో ప్రతి పక్షంతో పాటు స్వపక్షంలో కూడా ట్రంప్ కు వ్యతిరేకత వ్యక్తమైంది.