iDreamPost
android-app
ios-app

నయనతారతో పెళ్లిపై మొదటిసారి మీడియాతో మాట్లాడిన విగ్నేష్ శివన్.. అదే రోజు పెళ్లి కన్ఫర్మ్..

  • Published Jun 07, 2022 | 2:15 PM Updated Updated Jun 07, 2022 | 2:15 PM
నయనతారతో పెళ్లిపై మొదటిసారి మీడియాతో మాట్లాడిన విగ్నేష్ శివన్.. అదే రోజు పెళ్లి కన్ఫర్మ్..

లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గుళ్ళు, గోపురాలు, వెకేషన్ ప్లేసులు.. ఇలా అన్ని తిరిగేస్తున్నారు. గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలపై పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వీరి పెళ్లి జూన్ 9న జరగనుంది అని తెలిసింది.

ఇటీవల నయన్, విగ్నేష్ ఇద్దరూ కలిసి అధికారికంగా తమిళనాడు సీఎం స్టాలిన్ వద్దకు వెళ్లి తమ వివాహానికి ఆహ్వానించారు. దీంతో వీరి పెళ్లి మీద ఉన్న అనుమానాలు అన్ని పోయి అందరికి క్లారిటీ వచ్చింది. మహాబలిపురం ఓ ప్రైవేట్ హోటల్ లో జూన్ 9న వీరి వివాహం జరగనుంది. వీరి పెళ్ళికి పలు సౌత్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఇన్ని రోజులు తమ పెళ్లి గురించి మీడియాతో అధికారికంగా మాట్లాడలేదు.

తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లిపై మొదటి సారి మీడియాతో మాట్లాడారు. విగ్నేష్ శివన్ మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రియురాలు నయనతార, నేను జూన్​ 9 గురువారం మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాము. మా ఇద్దరి కుటుంబాలతో పాటు కొంతమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి రానున్నారు. మొదట మా పెళ్లిని శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో చేసుకోవాలి అనుకున్నాము కానీ అక్కడ ఎక్కువమంది సెలబ్రిటీలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మా వివాహ వేదికని మహాబలిపురానికి మార్చుకున్నాం. జూన్ 9న ఉదయం పెళ్లి మా పెళ్లి జరుగుతుంది. జూన్​ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాము. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలి అని తెలిపాడు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomgrandpashabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet