iDreamPost
iDreamPost
కేంద్రంలో చక్రం తిప్పుతారు.. అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని గురించి సొంత మీడియా, భజన బృందాలు వేనోళ్ళ కీర్తిస్తూ ఉండేవి. తామూ ఒకవైపే చూస్తూ, ఆ వైపును మాత్రమే ప్రజలకు చూపించే వీళ్ళంతా ఆయన్ను అలా పొగడడంలో పెద్దగా ఆక్షేపణల్లేవు.
కానీ వాస్తవాన్ని బైటపెట్టే ప్రభుత్వం అధికారంలో కొచ్చి, వాటిని నిష్పక్షపాతంగా వెల్లడిచేసే మీడియా కూడా తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం చంద్రబాబు, భజన బృందానికి అనుభంలోకొస్తోందని పలువురు మీడియా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అమరావతిలో భూ కుంభకోణం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలోనూ, ఫైబర్ నెట్ కాంట్రాక్టు పేరిట నారా లోకేష్‌నాయుడు పాల్పడిన అక్రమాలను గురించి ది హిందూ పత్రికలోనూ మొదటి పేజీల్లో వార్తలు రావడం ద్వారా ఇప్పుడు ఈ ఇద్దరు నాయుళ్ళు ఘనతను జాతీయ స్థాయిలో కూడా బైటపెట్టినటై్టందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అధికారం చేపట్టింది మొదలు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వ హాయంలో పక్కదారి పట్టిన ప్రజాధానాన్ని వెలికితీసే చర్యలను కూడా సీయం వైఎస్ జగన్ చేపట్టారు. ఇందుకు పలు విచారణా బృందాలను కూడా ఏర్పాటు చేసారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నాయకులపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అమరావతి భూ కుంభకోణం విషయంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకుల అరెస్టులు కూడా జరిగాయి.
ఇప్పుడు ఫైబర్‌నెట్ కాంట్రాక్టు వంతు వచ్చింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో రెండువేల కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన సంస్థను కాదని, అత్యధిక ధరకు టెండరు వేసిన సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించడం ద్వారా అక్రమాలకు తెరలేపినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు బృందం కూడా ఎదుర్కొలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు దర్యాప్తులపై కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకున్నారు. తాజాగా భూ కుంభకోణం అంశంలో తనను అరెస్టు చేయొద్దని ఆదేశించాలని మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చట్ట పరిధిలోని చర్యలకు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చట్టం ద్వారానే రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తప్పు చేయనేల.. ఇప్పుడు స్టేలు తెచ్చుకోనేల అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేసేస్తున్నారు.