iDreamPost
android-app
ios-app

‘నారప్ప’గా వెంకీ ఉగ్రరూపం

  • Published Dec 12, 2020 | 2:39 PM Updated Updated Dec 12, 2020 | 2:39 PM
‘నారప్ప’గా వెంకీ ఉగ్రరూపం

వెంకీ మామ తరువాత లాక్ డౌన్ వల్ల ఏడాది గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా నారప్ప త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్న పాతిక సెకండ్ల టీజర్ ఇందాక విడుదల చేశారు. మాసిపోయిన బట్టలతో, ఊర మాస్ వయసు మళ్ళిన పల్లెటూరి గెటప్ లో వెంకటేష్ చాలా కొత్తగా కానిపించడంతో పాటు నట విశ్వరూపం ప్రదర్శించినట్టు స్పష్టమవుతోంది. గతంలో చంటి లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేసినప్పటికీ నారప్ప మాత్రం కెరీర్లోనే స్పెషల్ గా నిలవబోతోంది.

వీడియోలో కేవలం హీరో పాత్రను మాత్రమే రివీల్ చేశారు. నారప్ప గత ఏడాది రిలీజైన బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్. ఒరిజినల్ వర్షన్ లో ధనుష్ ఇచ్చిన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో వెంకటేష్ జీవించేశారు. వీడియో నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ అభిమానూలు కోరుకున్న కంటెంట్ అయితే ఇచ్చేశారు. మణిశర్మ సంగీతం అందించిన నారప్పకు ప్రముఖ రచయిత సత్యానంద్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా చేశారు. ఎక్కువ మార్పులు చేయకుండా అసురన్ లో వెట్రి మారన్ ఇచ్చిన ట్రీట్మెంట్ ని ఫాలో అయినట్టు తెలుస్తోంది.

ప్రియమణి నారప్పలో వెంకటేష్ సరసన నటించింది. సినిమా బ్యాక్ డ్రాప్ రాయలసీమ నేపథ్యంలో అనంతపురం ప్రాంతంలో జరుగుతుంది. కుల వివక్షను ప్రశ్నిస్తూ తన కొడుకును చంపినందుకు హీరో జరిపే రివెంజ్ డ్రామానే నారప్ప. ఇప్పటిదాకా సాఫ్ట్ ఫ్యామిలి మూవీస్ ని మాత్రమే డీల్ చేసిన శ్రీకాంత్ అడ్డాలను నారప్పకు దర్శకుడిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే పోస్టర్లు, టీజర్ చూసాక ఫ్యాన్స్ కు నమ్మకం కలిగింది. అందులోనూ మణిశర్మ-వెంకటేష్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ఇంత గ్యాప్ తర్వాత రిపీట్ కావడం కూడా నారప్పకు ప్లస్ అవుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న నారప్ప విడుదల 2021 ప్రథమార్థంలోనే ఉంటుంది.

Link Here @ bit.ly/3gFGlSO