Idream media
Idream media
కొంచెం కష్టమైనా నారా లోకేష్ సాధించాడు. సాధారణ రోజుల్లో సాధ్యం కానిది కరోనా సమయంలో లోకేష్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. బరువు తగ్గేందుకు నారా లోకేష్ కఠినమైన నియమాలనే ఆచరించారని సమాచారం. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆహారం తీసుకోవడంపై ఆంక్షలు పెట్టుకున్నారని చెబుతున్నారు. అందుకే లావు తగ్గగలిగారు.
లోకేష్ బరువు తగ్గడంలో విశేషం ఏమీ లేదు. కానీ ఆయన బరువు తగ్గాలని ప్రయత్నం చేయడం ఇది మొదటి సారి కాకపోవడం వల్లనే ప్రస్తుతం విశేషమైంది. మంత్రిగా ఉన్నప్పుడు కూడా లోకేష్ బరువు తగ్గేందుకు యత్నించారు. అయితే ఆహార నియమాలు పాటించేందుకు, అవసరమైన వ్యాయామం చేసేందుకు అప్పట్లో సరైన సమయం లభించని కారణంగా బరువు తగ్గే కార్యక్రమం వాయిదా పడింది. 2019 ఎన్నికల తర్వాత కూడా లోకేష్ ఆ ప్రయత్నం మళ్లీ మొదలు పెట్టారు. చాలా రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదు. కనీసం ఎవరికీ కనిపించలేదు. అయితే ఆ సమయంలోనూ బరువు తగ్గడం సాధ్యపడలేదు. ఇన్నాళ్లుకు కరోనా పుణ్యమా అంటూ లోకేష్‌కు సరైన సమయం లభించింది. ఆహార నియమాలు అవలంభించేందుకు లాక్‌డౌన్ ఉపకరించింది. ఇంట్లోని ఆహారం మితంగా తీసుకుంటూ లోకేష్ తన లక్ష్యాన్ని ఎట్టకేలకు చేరుకున్నారు.
లోకేష్ స్లిమ్‌గా అవడంపై ఆయన కన్నా టీడీపీ శ్రేణలు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ యువ నాయకుడి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషాలు పంచుకుంటున్నారు. తెలుగు సరిగా పలకకపోవడం వల్ల తరచూ లోకేష్ ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నారు. ఆ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ఆయన శరీరాకృతిపై కూడా హాస్యోక్తులు విసురుతున్నారు. ప్రస్తుతం లోకేష్ బరువు తగ్గి నాజూగ్గా తయారవడం వల్ల ఇకపై ప్రత్యర్థులకు ఆయన లావాటి శరీరంపై ఛలోక్తులు విసిరే అవకాశం లభించకపోవచ్చు. అదే ఇప్పుడు టీడీపీ శ్రేణుల ఆనందానికి కారణం అవుతోంది. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ప్లకార్డు ప్రదర్శించిన లోకేష్‌ను గమనించిన వారు ఆయన ముఖం, శరీరంలో వచ్చిన మార్పులపై ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
Read Also : ఆ పని చేసే కొల్లు అడ్డంగా దొరికిపోయాడా..?!