iDreamPost
android-app
ios-app

పవన్‌ కళ్యాణ్‌కి నాని థ్యాంక్స్‌.. ఎందుకంటే.!

పవన్‌ కళ్యాణ్‌కి నాని థ్యాంక్స్‌.. ఎందుకంటే.!

పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, పవన్‌ కళ్యాణ్‌కి నేచురల్‌ స్టార్‌ నాని ‘థ్యాంక్స్‌’ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ కళ్యాణ్‌కి నాని ఎందుకు ‘థ్యాంక్స్‌’ చెప్పాడో తెలుసా.? ‘వకీల్‌ సాబ్‌’ సినిమా చేస్తున్నందుకు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ న్యాయవాది పాత్రలో కన్పించబోతున్న విషయం విదితమే. ఇది బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కి తెలుగు రీమేక్‌. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన సినిమా ‘పింక్‌’. తాప్సీ మరో ముఖ్యమైన పాత్రలో నటించింది ‘పింక్‌’ సినిమా కోసం. ఇదే ‘పింక్‌’ తమిళంలోకి అజిత్‌ హీరోగా రీమేక్‌ అయ్యింది. మహిళలపై అత్యాచారాల నేపథ్యంలో నడిచే కోర్ట్‌ డ్రామా ఈ సినిమా. దేవవ్యాప్తంగా ‘పింక్‌’ సంచలనాలు సృష్టించింది.

తమిళంలోనూ వసూళ్ళనే కాదు.. విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకుంది. నిజానికి ఇది కమర్షియల్‌ సినిమా కానే కాదు. అయినాగానీ, పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ సినిమా చేయాలనుకోవడం, ఈ సినిమాలోని కథాంశం పట్ల ఆయనకున్న నమ్మకాన్ని.. ఓ మంచి విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఆయన తపననూ చెప్పకనే చెబుతోంది. నాని ‘థ్యాంక్స్‌’ చెప్పింది కూడా ఇందుకే. బోనీ కపూర్‌, దిల్‌ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా, వేణు శ్రీరావ్‌ు దర్శకత్వంలో ‘వకీల్‌ సాబ్‌’ రూపొందుతున్న విషయం విదితమే. నివేదా థామస్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించబోతోంది. పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఈ రోజు ‘వకీల్‌ సాబ్‌’ స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు.