iDreamPost
android-app
ios-app

‘వి’లో నాని పాత్ర విశేషాలు

  • Published Aug 21, 2020 | 5:58 AM Updated Updated Aug 21, 2020 | 5:58 AM
‘వి’లో నాని పాత్ర విశేషాలు

నిన్న అధికారికంగా నాని వి ఓటిటి రిలీజ్ ప్రకటన వచ్చాక అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు సెప్టెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నారు. ఒక స్టార్ హీరో మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లో నుంచే చూసే థ్రిల్ ని ఎంజాయ్ చేసేందుకు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు, నాని ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా వస్తున్న వి హీరోగా అతని డెబ్యూ మూవీ అష్టా చెమ్మ రిలీజ్ డేట్ రోజే వస్తుండటం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. 12 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నేనే మీ ఇంటికి వస్తున్నానని నాని ఇచ్చిన మెసేజ్ బాగా వైరల్ అయ్యింది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అనేలా వి గురించిన అంచనాలు ఇప్పుడు అమాంతం ఎగబాకుతున్నాయి.

రేపో లేదా ఇంకొద్దిరోజుల్లో వదిలే ట్రైలర్ తో ఇవి ఇంకా రెట్టింపు కావడం ఖాయం. మొదటిసారి నెగటివ్ షేడ్స్ పాత్ర పోషించిన నాని తెరమీద ఎలా కనిపిస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఇన్ సైడ్ టాక్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. అందరూ ఊహిస్తున్నట్టు నాని రోల్ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఉండదట. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి యాక్టివ్ అయిపోయి అక్కడి నుంచి కథనాన్ని పరుగులు పెట్టిస్తుందని టాక్. అప్పటిదాకా నివేదా థామస్, సుధీర్ బాబుల ట్రాక్ తోనే ఎక్కువ స్టోరీ ఉంటుందని తెలిసింది. క్రైమ్ నవల రచయిత్రి అయిన నివేదా ఆర్మీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న నాని సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాడు అనే దాని గురించి పరిశోధన చేస్తుంటుందట. అందులోనే విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయని అవి ఆడియన్స్ కి థ్రిల్ ఇవ్వడం ఖాయమని యూనిట్ మాట.

క్యాట్ అండ్ మౌస్ గేమ్ మన సినిమాల్లో కొత్తేమి కాకపోయినా ఇందులో మాత్రం చాలా డిఫరెంట్ గా చూపిస్తారట. మొత్తానికి ఫ్యాన్స్ ఊహించని విధంగా వి ఉండబోతోందన్నది వాస్తవం. అదితిరావు హైదరి నానికి జోడిగా ఓ కీలకమైన ఎపిసోడ్ లో కనిపించనుంది. అమిత్ త్రివేది పాటలు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. అన్నింటిని మించి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ 5 అర్ధరాత్రి కొన్ని లక్షల స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాపులు, హోమ్ థియేటర్లు వి ప్రీమియర్ షోలతో బిజీగా ఉండటం ఖాయం. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం ప్రైమ్ కోరుకున్న దాని కన్నా భారీ స్పందన దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విని స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో ఇతర సినిమాల కీలక ప్రకటనలు రావడం పక్కా .