iDreamPost
android-app
ios-app

Bimbisara : డేట్ కోసం నందమూరి హీరో తిప్పలు

  • Published Nov 18, 2021 | 8:26 AM Updated Updated Nov 18, 2021 | 8:26 AM
Bimbisara : డేట్ కోసం నందమూరి హీరో తిప్పలు

సక్సెస్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ మధ్యమధ్యలో హిట్లు కొడుతూ అలా నెట్టుకోస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ బింబిసార విడుదలకు సిద్ధంగా ఉంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భీమ్లా నాయక్ లో రానాకు జోడిగా నటిస్తున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్. బాహుబలి రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన పోస్టర్ చాలా రోజుల క్రితమే విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు బింబిసారని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారని ఇన్ సైడ్ టాక్.

ప్రాధమికంగా డిసెంబర్ 24 లేదా 25 ఫిక్స్ అయ్యారట. కానీ ఆ డేట్లో నాని శ్యామ్ సింగ రాయ్, వరుణ్ తేజ్ గనిలు పోటీలో ఉన్నాయి. వాటికి ఎదురీదడం అంత ఈజీ కాదు. పైగా ఆ రెండు సినిమాలకు ఉన్నంత బజ్ బింబిసారకు లేదు. వీటికి తోడు బాలీవుడ్ మూవీ 83 కూడా రేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. మరి కళ్యాణ్ రామ్ వీళ్ళ మధ్యలో ఎలా సింక్ అవుతాడో అంతు చిక్కడం లేదు. ఈ నవంబర్ నెలాఖరుకు రావొచ్చు. రాజ్ తరుణ్ అనుభవించు రాజా ఒకటే ఉంది. కానీ ప్రమోషన్లకు టైం లేదు. సామాన్య ప్రేక్షకులకు అసలు బింబిసార సినిమా అనేది ఒకటుందని సరిగా తెలియదు. సో పబ్లిసిటీ గట్టిగానే చేయాల్సి ఉంది.

కాబట్టి హడావిడిగా డేట్ సెట్ చేసుకోవడానికి లేదు. డిసెంబర్ 10 స్లాట్ ఖాళీగానే ఉంది. గుడ్ లక్ సఖి మాత్రమే ప్రస్తుతం ఫిక్స్ చేశారు. కానీ కేవలం వారం గ్యాప్ లో పుష్ప వస్తుంది కాబట్టి థియేటర్లు ఎగిరిపోయి ఛాన్స్ ఉంది. దీనికన్నా బన్నీ సినిమా వచ్చాక దిగడం సేఫ్ గేమ్ అవుతుంది. ఇది కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన సినిమా. శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. జనవరిలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి గ్రాండియర్లు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా డిసెంబర్ లోనే రమ్మని తమ్ముడు తారక్ కూడా సలహా ఇచ్చాడట. డిసెంబర్ 2ని బాబాయ్ అఖండ కోసం తీసుకున్నాడు. మరి బింబిసార ఏం చేస్తాడో

Also Read : NBK And SSMB : అరుదైన కలయికకు కొరటాల ప్లాన్ ?

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş