iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబోలో అక్కినేని మల్టీస్టారర్

  • Published Sep 26, 2022 | 3:16 PM Updated Updated Sep 26, 2022 | 3:16 PM
క్రేజీ కాంబోలో అక్కినేని మల్టీస్టారర్

కింగ్ అక్కినేని నాగార్జున మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. వచ్చే నెల 5న విడుదల కానున్న ది ఘోస్ట్ పట్ల చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ ఉన్నప్పటికీ రెండూ విజయం సాధిస్తాయనే నమ్మకం నిన్న కర్నూలులో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తం చేశారు. 1989లో ట్రెండ్ సెట్టర్ శివ వచ్చిన తేదీకే ఇప్పుడీ ఘోస్ట్ రావడం పట్ల అభిమనులు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. వైల్డ్ డాగ్ డిజాస్టర్ తర్వాత బంగార్రాజుతో హిట్టు కొట్టిన నాగ్ అందులో కొడుకు నాగ చైతన్యకు కూడా షేర్ ఇవ్వాల్సి రావడంతో సోలో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఘోస్ట్ ఆ అంచనాలను నిలబెట్టుకుంటుందా లేదానేది త్వరలో తేలనుంది.

ఇదిలా ఉండగా అఖిల్ తో కలిసి త్వరలోనే తానో మల్టీస్టారర్ చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. దర్శకుడు ఎవరనేది చెప్పలేదు కానీ లీకైన సోర్స్ ప్రకారం అతనెవరో కాదు గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజానట. కొన్ని నెలల క్రితం చెప్పిన స్టోరీ ఒకటి బాగా నచ్చడంతో ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. దసరా హడావిడి అయిపోయాక ఫైనల్ వెర్షన్ విని తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం హనుమాన్ జంక్షన్ తర్వాత టాలీవుడ్ కు పూర్తిగా దూరమైన మోహన్ రాజా ప్రస్తుత మకాం హైదరాబాద్ లోనే పెట్టేశారు. ఒకవేళ అక్కినేని ఫ్యామిలీ ప్రాజెక్టు కనక ఓకే అయితే ఇంకో ఏడాది పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది.

నాగార్జున అఖిల్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనంలో ఒకే ఫ్రేమ్ లో కనిపించారు కానీ అది కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమయ్యింది. ఘోస్ట్, ఏజెంట్ లకన్నా డబుల్ బడ్జెట్ అండ్ యాక్షన్ తో తమ కలయిక ఉంటుందని నాగ్ చెప్పడం చూస్తే ఆల్రెడీ ఓకే చెప్పేసినట్టు అర్థమవుతోంది. గాడ్ ఫాదర్ టెన్షన్ లో ఉన్న మోహన్ రాజా సైతం దీని ప్రస్తావన ఎక్కడా తేవడం లేదు. ముందు ఈ మెగా మూవీని బ్లాక్ బస్టర్ చేశాక కొన్నిరోజులు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కింగ్ కోసం కసరత్తులు మొదలుపెడతారు. మొత్తానికి బంగార్రాజులో చైతు నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇప్పుడు అఖిల్ వంతు రాబోతోంది

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahismarsbahis güncel girişjojobet giriş adresi