iDreamPost
android-app
ios-app

చైతూ-కృతిశెట్టి కాంబో రిపీట్.. ఈ సారి తెలుగు, తమిళ్ లో హిట్??

  • Published Jun 23, 2022 | 5:42 PM Updated Updated Jun 23, 2022 | 5:42 PM
చైతూ-కృతిశెట్టి కాంబో రిపీట్.. ఈ సారి తెలుగు, తమిళ్ లో హిట్??

ప్రస్తుతం నాగ చైతన్య, కృతిశెట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. చైతూ లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. త్వరలోనే థ్యాంక్ యు సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ చేస్తున్నాడు చైతూ. గతంలో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెలుగు -తమిళ్ లో బై లింగ్వల్ సినిమాగా ఓ సినిమాని అన్నౌన్స్ చేశారు. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

నాగ చైతన్య వెంకట్ ప్రభు సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. కృతి శెట్టి కూడా ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. అలాగే చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో బిజీ బిజీగా సినిమాలు చేసేస్తోంది కృతి. గతంలో నాగ చైతన్య – కృతి శెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఈ జంట అదిరిపోయే కెమిస్ట్రీ పండించి హిట్ కొట్టారు.

తాజాగా మరోసారి ఈ జంట కలిసి నటించనున్నారు. నాగ చైతన్య 22వ సినిమాగా, కృతి శెట్టి హీరోయిన్ గా, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో బై లింగ్వల్ సినిమాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమాకి పూజా కార్యక్రమం నిర్వహించగా తెలుగు వర్షన్ కి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చైతూ – కృతిశెట్టి పై క్లాప్ కొట్టారు. తమిళ్ వర్షన్ కి సీనియర్ డైరెక్టర్ భారతి రాజా క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో రానా, శివ కార్తికేయన్, డైరెక్టర్ భారతీరాజా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ లింగు స్వామి, బోయపాటి పాల్గొన్నారు. మరోసారి చైతూ- కృతి శెట్టి కలిసి నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alJojobet girişJojobet girişberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş