Idream media
Idream media
జనసేన నేత, 2019 జనరల్ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) ఇప్పుడు వార్తాల్లోకి ఎక్కారు…అయితే అదేదో ప్రజలకు సేవ చేసో, లేకపోతే కరోనా నేపథ్యంలో వలస కార్మికులకు అండగా ఉండి కాదండోయో..ఒక వివాదాస్పద ట్విట్ చేసి వార్తాల్లో, సామాజిక మాధ్యమంల్లో నిలిచారు.
జాతిపిత మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. “గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ కొనియాడారు. అంతేకాదు గాంధీని చంపడం కరెక్టా? కాదా? అనేది పక్కన పెడితే.. ఆయన గాంధీని చంపక ముందు వరకు ఆయన ఎలాంటి నేరాలు చేయలేదు. ఆయన వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)” ”గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది” అంటూ ట్వీట్ చేశాడు. “పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్” అని ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం లేచింది.
దీనిపై గాంధీయవాదులు, ప్రజాస్వామ్య వాదులు, లౌకికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత గాడ్సే సానుభూతి పరులు నాగబాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అయితే మొత్తంగా ఆయన వ్యాఖ్యలపై ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తిని చంపడం కరెక్ట్ ఎలా అవుతుందంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా నాగబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారని కొంత మంది సొంత పార్టీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. ఇది జనసేన పార్టీ పునాదుల స్ఫూర్తికి విఘాతమని విమర్శలు చేస్తున్నారు. పార్టీ పెద్దలే ఇలా పార్టీ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, సామన్య కార్యకర్తల పరిస్థితేంటని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు…నాగబాబు మనసులో ఉన్నది చెప్పడంతో జనసేన అసలు రూపం బయటపడిందని కొంత మంది విమర్శలు చేస్తున్నారు…అయితే ఆయన ట్విట్ తో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో నాగబాబు నన్ను అర్థం చేసుకోండని, నేను నాధరాం గాడ్సే నేరాన్ని సమర్థించలేదని వివరణ ఇస్తూ మరో ట్విట్ చేశారు..
“దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్ల కన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం” ట్విట్టర్ లో పేర్కొన్నారు…ఈ ట్వీట్ కూడా రచ్చకు దారితీసింది..