iDreamPost
android-app
ios-app

Naga Shaurya : డిజిటల్ లో నాగశౌర్య డబుల్ బొనాంజా

  • Published Dec 27, 2021 | 11:07 AM Updated Updated Dec 27, 2021 | 11:07 AM
  • Published Dec 27, 2021 | 11:07 AMUpdated Dec 27, 2021 | 11:07 AM
Naga Shaurya : డిజిటల్ లో నాగశౌర్య డబుల్ బొనాంజా

నాగ శౌర్య కొత్త సినిమాలు రెండు వరుడు కావలెను, లక్ష్యలు ఒకేరోజు ఓటిటిలోకి రాబోతున్నాయి. మొదటిది జీ 5, రెండోది ఆహా ద్వారా జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇది ప్లాన్ ప్రకారం చేసుకున్నది కాకపోయినా వరుడు కావలెను మాత్రం డిజిటల్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. లక్ష్య నెలలోపే ఓటిటి ప్రేక్షకులను పలకరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన ఈ సినిమాలు ఓటిటి స్పేస్ లో మంచి స్పందన దక్కించుకుంటాయనే నమ్మకం అభిమానుల్లో ఉంది. వరుడు కావలెను ఉన్నంతలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రెవిన్యూ రాబట్టగా లక్ష్య డిజాస్టర్ అయ్యింది.

గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ రెండు ఆర్ఆర్ఆర్ థియేటర్లలో అడుగు పెడుతున్న రోజే స్మార్ట్ స్క్రీన్లలో రావడం. ఆ రోజు ఎవరు పట్టించుకుంటారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ డే టికెట్లు దొరక్క నిరాశతో ఉండేవాళ్ళు లక్షలు కోట్లలో ఉంటారు. వాళ్ళకు ప్రత్యాన్మాయంగా ఈ రెండు ఉంటాయి. ఇటీవలో కాలంలో ఏ హీరో రెండు సినిమాలు ఒకే రోజు ఓటిటిలో వచ్చిన దాఖలాలు లేవు. అప్పుడెప్పుడో నాని ఎవడే సుబ్రహ్మణ్యం-జెండాపై కపిరాజు, బాలకృష్ణ నిప్పురవ్వ – బంగారు బుల్లోడు సేమ్ డే సినిమా హాళ్లలో వచ్చాయి కానీ ఇలా డిజిటల్ వచ్చిన సందర్భాలు మాత్రం అరుదు. అందుకే నాగ శౌర్య ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజా.

ఇక నాగ శౌర్య పరిస్థితి చూస్తే గట్టి బ్లాక్ బస్టర్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాడు. ఛలో తర్వాత గట్టిగా చెప్పుకునే హిట్టు ఒక్కటీ లేదు. దాదాపు అన్నీ నిరాశపరిచినవే. వరుడు కావలెను మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అది నిరాశపరిచింది. లక్ష్య కోసం కష్టపడి ఎయిట్ ప్యాక్ చేస్తే కొంచెం కూడా లాభం లేకపోయింది. అందుకే నిర్మాణంలో ఉన్న రెండు మూడు సినిమాల మీద సీరియస్ దృష్టి పెడుతున్నాడు. ఇలాగే అయితే మార్కెట్ ఇంకా ప్రభావితం చెందుతుంది కాబట్టి అర్జెంటుగా ఒక హిట్టు రావాల్సిన అవసరం ఉంది. నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక, అనీష్ కృష్ణ డైరెక్షన్లో ఒక మూవీ సెట్స్ మీదున్నాయి

Also Read : Shyam Singha Roy : వారాంతంలో న్యాచురల్ స్టార్ హవా

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom