iDreamPost
android-app
ios-app

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

  • Published Nov 29, 2020 | 7:22 AM Updated Updated Nov 29, 2020 | 7:22 AM
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. ఇటీవల మంత్రి పేర్ని నాని తల్లి చనిపోవడంతో పెద్దకర్మ ఉండటంతో పూజాధికాలు పూర్తి చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చిన కార్యకర్తలు సంభాషిస్తూ ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పేర్ని నానిపై తాపీతో దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది.

హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో వెంటనే స్పంధించిన మంత్రి అనుచరులు అతనిని పట్టుకుని పొలీసులకు అప్పగించారు. ఈ దాడికి వెనక ఉన్న కుట్రను చేదించేందుకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఈ దాడికి యత్నించగా అది విఫలం అవ్వడంతో మంత్రి నానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఇటీవలే పేర్ని నాని ముఖ్య అనుచరుడు మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య జరిగిన విషయం తెలిసిందే.ఈ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనని అరెస్టు చేయగా ప్రస్తుతం బైల్ పై ఉన్నారు. తాజాగా మంత్రి నానిపైనే జరిగిన ఈ దాడితో మచిలీపట్నం మరొకసారి ఉలిక్కిపడింది.

marsbahis girişjojobet