iDreamPost
android-app
ios-app

మొదలైన మున్సిపల్ పోలింగ్ – పట్టు కోసం వైసీపీ ,ఉనికి కోసం టీడీపీ ….

  • Published Mar 10, 2021 | 2:07 AM Updated Updated Mar 10, 2021 | 2:07 AM
మొదలైన మున్సిపల్ పోలింగ్ – పట్టు కోసం వైసీపీ ,ఉనికి కోసం టీడీపీ  ….

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని 12 కార్పొరేషన్స్ , 75 మునిసిపాలిటీ / అర్బన్ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహించటానికి నోటిఫికేషన్ జారీ చేయగా గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల , మాచర్ల , కడప జిల్లా పులివెందుల , చిత్తూరు జిల్లా పుంగనూరు మునిసిపాలిటీలు ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా . కొన్ని కేసులతో నిర్వహణ అనుమానాస్పదం అయిన ఏలూరు , చిలకలూరిపేట మునిసిపాలిటీల్లో కూడా ఎట్టకేలకు ఎన్నికలు ఖరారు అయ్యాయి .

ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయంటూ ఏలూరు మునిసిపాలిటీ ఎన్నిక పై టీడీపీ నేత కోర్టు కెళ్లి నిలుపుదల ఆదేశాలు పొందగా ఆ నిర్ణయాన్ని హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయగా సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల పై హై కోర్ట్ ధర్మాసనం స్టే ఇస్తూ ఎన్నికలు నిర్వహించటానికి మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది . అలాగే చిలకలూరిపేట మునిసిపాలిటీ విస్తరణలో భాగంగా కొన్ని గ్రామ పంచాయితీలు విలీనం చేస్తూ జారీ చేసిన జీవో ని కొందరు కోర్టులో సవాల్ చేసిన కారణంగా ఎన్నికల నిర్వహణ అనుమానాస్పద స్థితిలో పడగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హై కోర్ట్ కొన్ని షరతులతో అనుమతులు జారీ చేసింది .

Also Read:ఏలూరు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏకగ్రీవాలు పోగా మొత్తం 12 కార్పొరేషన్లు , 71 మునిసిపాలిటీ , అర్బన్ పంచాయతీలకు నేడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్న ఎన్నికలకు ప్రభుత్వం 30 కోట్ల మేర నిధులు విడుదల చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . 78 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ నెల 14 వ తేదీన వెలువడనున్నాయి .

ప్రధాన పార్టీలైన వైసీపీ , టీడీపీ మధ్య పోరు కేంద్రీకృతం కాగా ఎప్పటిలాగే వైసీపీ ఏ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగింది . మరో పార్టీ జనసేన అక్కడక్కడా తమ అభ్యర్ధులని నిలపగా , జనసేన మిత్ర పక్షం బిజెపి సైతం పూర్తి స్థాయిలో అభ్యర్ధులని నిలపలేదు . పొత్తులో భాగంగా కొన్ని చోట్ల బిజెపి , జనసేన కలిసి ప్రచారం నిర్వహిస్తుండగా , కొన్ని చోట్ల జనసేన టీడీపీకి మద్దతుగా , కొన్ని చోట్ల టీడీపీ జనసేనకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో పొత్తుల విషయంలో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది . ఏదేమైనా స్పష్టమైన ప్రజా తీర్పు ఏమిటి అన్నది తెలుసుకోవటం కోసం ఈ నెల 14 వరకూ వేచి చూడాలి .