Idream media
Idream media
మూలిగే నక్క మీద తాటి పండు పడిపోవడం అంటే ఇదే.. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను ఏదో దాటేశాం అని రిలీఫ్ ఫీలవుతున్న తరుణంలో చంద్రబాబుకు ఇంకో పోరాటం ఎదురైంది. దీన్నెలా దేవుడా అని కార్యకర్తల తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు ఉండవు కాబట్టి గెలిచినవాళ్ళంతా తమవాళ్లే అని చెప్పుకున్నా ఎక్కడా కాదని నిరూపించలేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం నాయుకులు, ఇంకా ఎల్లో మీడియ కూడా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దుమ్మురేపిందని, అధికారపార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకున్నారు. దీనికి బలం చేకూర్చేందుకు కొన్ని అంకెలు చూపుతున్నారు.
ఓవైపు వేలల్లో వైసీపీ అభ్యర్థులు సర్పంచులుగా గెల్చు కొస్తున్నప్పటికీ తాము కూడా భారీగానే గెలుస్తున్నామని చెప్పుకుంటూ కార్యకర్తల్లో మనో స్థైర్యం కోల్పోకుండా మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు. సరే ఈ పూట ఏదోలా గడిచిపోయింది. గుర్తు, పార్టీతో సంబంధం లేని ఎన్నికలు కాబట్టి ఏదోలా నంబర్లు చెప్పేసి మ్యానేజ్ చేసేశారు. కానీ మున్సిపల్ ఎన్నికలు, అందులో పోటీ చేసే ప్రతి వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్, ఇంకా చైర్మన్, మేయర్లు ఆయా పార్టీల తరఫునే ఎన్నికల్లో నిలబడతారు కాబట్టి ఏఏ పార్టీకి ఎన్ని వార్డులు వచ్చాయి. ఎన్ని పట్టణాలు, ఎన్ని నగరపాలక సంస్థలు ఎక్కడెక్కడ గెలుపొందాయి. ఎవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయన్నది కూడా లెక్కలేలిపోతుంది. ఇప్పుడు గెలిచినోళ్లంతా తమవాళ్లే అని చెప్పుకోవడం కుదరని పని.
పోటీకి అభ్యర్థులు దూరం
ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎదుర్కొని దీటుగా నిలిచేందుకు తెలుగుదేశానికి సరైన ఆ భ్యర్థులు దొరకడం లేదు. ఉన్న వాళ్లలోనే ఏదోలా పోటీలో నిలవాలన్నట్లుగా ఉంది పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో ఏక పక్షంగా ఫలితాలు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఎంత ఉందన్నది ప్రజలకు, పార్టీలకు చాటిచెప్పింది. అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తేనే స్థానిక సంస్థలకు నిధులు వస్తాయని, పల్లెలు బాగుపడతాయని ప్రజలు భావించడ వల్లనే 85 శాతానికి పైగా పంచాయతీలు వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరి పట్టణాల్లో ప్రజల మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది కదా.. మరి వాళ్లను ఒప్పించడం, ఓట్లు సాధించడం కష్టం కదా అన్న భావనలో తెలుగుదేశం వారున్నారు. ఎక్కడో బలమైన నాయుకుడు లేదా కుటుంబపరమైన ఆధిక్యత, పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంటే తప్ప తెలుగుదేశం ఎక్కడా గెలిచేందుకు అవకాశాల్లేవు, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ ఎన్నికలకు కార్యకర్తలను ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో చూడాలి.