దక్షిణాదిన పదేళ్లకు పైగా సినిమాలను చేస్తున్న తమన్నా, ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ లోనే ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తమన్నా ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కారు దిగి నడచివస్తుంటే, గ్లామర్ క్వీన్ వస్తున్నట్లే అనిపించింది. ఆమె బ్యూటీకి అందరూ ఫిదా.
ఆమె అందాన్ని పొగుడుతున్నవాళ్లు, ఆమె డ్రెస్ ను చూసి మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు. నెటిజన్ “ఆమె మిల్కీ బ్యూటీ, తెల్లగా ఉంది..బ్లాక్ డ్రెస్ తో ఆమె వెలిగిపోతోందని రియాక్ట్ అయ్యాడు. మరో నెటిజన్ మాత్రం “ఆమెకు డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది?” అని కామెంట్ చేశాడు.
సినిమాల విషయానికొస్తే, తమన్నా Gurthunda Seethakalam, Plan A Plan B, Babli Bouncer, Bhola Shankar సినిమాల్లో నటిస్తోంది.