iDreamPost
android-app
ios-app

విశాఖలో ధోని తొలి వన్డే శతకం కొట్టి నేటికి 15 సంవత్సరాలు

విశాఖలో ధోని తొలి వన్డే శతకం కొట్టి నేటికి 15 సంవత్సరాలు

2005లో ఏప్రిల్ 5 భారత మాజీ కెప్టెన్,ప్రస్తుత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్ ధోని తొలి వన్డే శతకంతో ప్రపంచానికి తన బ్యాటింగ్ సత్తాను పరిచయం చేసిన రోజు.విశాఖపట్నంలోని డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డే ధోని ధనాధన్ షాట్‌లకు వేదికగా నిలిచింది.2004లో కెన్యాలో జరిగిన వన్డే పోటీలో ధోని పాకిస్తాన్-A పై భారత్-A తరఫున క్లీన్ స్ట్రైక్‌తో రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు.ఈ బ్యాటింగ్ తీరును దృష్టిలో పెట్టుకొని ఆనాటి కెప్టెన్,నేటి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఈ నిర్ణయమే ధోనీ క్రికెట్‌ కెరీర్‌ను మలుపు తిప్పి మ్యాచ్ ఉత్తమ ఫినిషర్‌గా,జట్టును విశ్వవిజేతగా నిలిపిన సారధిగా చిరస్మరణీయ విజయాలు సాధించేటట్లు చేసింది.

విశాఖ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మొదటి బంతినుండే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో సచిన్ టెండూల్కర్ వికెట్‌ను 26 పరుగుల వద్ద రనౌట్ రూపములో కోల్పోయింది.ఆ సమయంలో అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తూ కెప్టెన్‌ గంగూలీ తనకు బదులుగా ధోనికి బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో దించాడు.అప్పటికి కేవలం నాలుగు వన్డేలు ఆడిన ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 12 పరుగులు మాత్రమే.

ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (74)తో పాటు రెండో వికెట్ కోసం 96 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.భారత ఇన్నింగ్స్ మొదటలో సెహ్వాగ్ చెలరేగి ఆడుతున్న సమయంలో ధోని బ్యాటింగ్ ప్రతిభా పెద్దగా వెలుగు చూడలేదు.ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి ధోని సింగిల్ తీసి తన తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.49 బంతులలో 4 ఫోర్లు,ఒక సిక్స్‌తో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.అదే 20 ఓవర్లలో కెప్టెన్ గంగూలీ కూడా ఔట్ కాగా వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్,ధోనీతో జత కలిశాడు.ఈ దశలో జూలు విదిల్చిన సింహం వలె పాక్‌ బౌలర్‌లపై తన ధనాధన్ షాట్‌లతో విరుచుకుపడ్డాడు.

నాలుగో వికెట్ భాగస్వామ్యంలో సంపూర్ణ ఆధిపత్యం వహించిన ధోని,ద్రావిడ్ తో కలిసి జట్టు స్కోర్‌కు 149 పరుగులు జత చేశాడు.పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది బౌల్ చేసిన 32వ ఓవర్ రెండో బంతికి ధోని సింగిల్ పరుగు చేసి తొలిసారిగా మూడు అంకెల సెంచరీ మార్క్ ను సాధించాడు.ఇన్నింగ్స్ 40 ఓవర్లలో స్పిన్నర్ అఫ్రిదీ బౌలింగ్‌లో ఒక ఫోర్,2 సిక్స్‌తో ఏకంగా 17 పరుగులు రాబట్టాడు.అయితే తర్వాతి హఫీజ్ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మాలిక్ పట్టిన క్యాచ్‌తో ఔట్‌ కావడంతో పాక్ బౌలర్లు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు.

జార్ఖండ్ డైనమెట్ ధోని 123 బంతులలో 15 ఫోర్లు,నాలుగు సిక్స్‌తో 148 పరుగులు చేసి తన పవర్ బ్యాటింగ్ షాట్స్ ప్రపంచానికి పరిచయం చేశాడు.నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 356-9 పరుగులు చేసింది.భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా 4 వికెట్లు,యువరాజ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి రాణించడంతో పాక్ 44.1 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 58 పరుగుల తేడాతో పాక్‌పై టీమిండియా గెలుపొందింది.

భారత విజయ సాధనలోbe కీలక పరుగులు చేసిన ధోని వన్డేల్లో తన తొలి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును విశాఖపట్నంలో విశేషం.ఈ అవార్డుతో భారత్ తరఫున వన్డేలలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పొందిన రెండో వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని పేరొందాడు.మిస్టర్ కూల్ ధోని మూడో స్థానంలో ఆడిన 17 వన్డేలలో 82.75 సగటుతో 993 పరుగులు చేశాడు. మూడవ ప్లేస్‌లో ఎంఎస్ 99.69 స్ట్రైక్ రేట్‌తో 2 సెంచరీలతో సహా 6 అర్ధ సెంచరీలతో సాధించాడు.