iDreamPost
android-app
ios-app

RRR సోషల్ మీడియా దెబ్బ, జీ5 గుడ్ న్యూస్, ఉచితంగానే ఆర్ఆర్ఆర్

  • Published May 19, 2022 | 1:40 PM Updated Updated May 19, 2022 | 1:44 PM
RRR సోషల్ మీడియా దెబ్బ, జీ5 గుడ్ న్యూస్, ఉచితంగానే ఆర్ఆర్ఆర్

అవకాశం ఉంది కదాని దోచుకుంటామంటే మాకు వేరే దారులున్నాయని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన ఓటిటి ఫ్యాన్స్ దెబ్బకు ఆర్ఆర్ఆర్ ఉచితంగానే రాబోతోంది. జీ5 దీన్ని రేపటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ముందు 200 రూపాయలు పే పర్ వ్యూగా డిసైడ్ చేశారు. ఒకవేళ యాప్ చందా తీసుకుంటే 100 కడితే చాలనే వెసులుబాటు ఇచ్చారు. కానీ దీనికన్నా ముందు ఇదే తరహాలో 199 రూపాయలకు కెజిఎఫ్ చాప్టర్ 2ని స్ట్రీమ్ చేసిన అమెజాన్ ప్రైమ్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో తనకూ అలాంటి అనుభవమే ఎదురవుతుందని జీ5కు అర్థమయ్యింది. దీంతో ఇందాక కొత్త ప్రకటన ఇచ్చింది.

దాని ప్రకారం జీ5 ప్రీమియం సభ్యత్వం ఉన్న వాళ్ళు ఫ్రీగా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఫ్రీగా ఆర్ఆర్ఆర్ చూసుకోవచ్చు. బాషకు సంబంధించిన నిబంధన కూడా లేదు. తెలుగు తమిళం మళయాలం కన్నడం మీ ఇష్టం. హిందీ కావాలంటే నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఎంజయ్ చేయొచ్చు. అక్కడా ఎక్స్ ట్రా ఛార్జ్ ఉండదు. దాని సబ్స్క్రైబర్ అయితే చాలు. వెబ్ మీడియాలోనూ ఈ డబ్బులు కట్టి సినిమా చూసే మోడల్ మీద పలు కథనాలు రావడంతో జీ5 తీసుకున్న నిర్ణయం తెలివైనదే. అసలే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోల విశ్వరూపాన్ని రిపీట్ షోలతో చూడాలని తహతహలాడుతున్నారు. వాళ్ళకిది పండగే.

మొత్తానికి ఈ పరిణామం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆపుతుంది. టెలిగ్రామ్, టొరెంట్ సైట్లలో ఉన్న పైరసీని ఏం చేయలేక నిస్సహాయంగా పరిశ్రమ నిలుస్తున్న తరుణంలో ఓటిటిలు కూడా దోపిడీకి తెగబడితే వాటికి మరిన్ని రెక్కలు వస్తాయి. అవగాహన లేని వాడు కూడా నేర్చుకుని మరీ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఇప్పుడిప్పుడే మన దేశంలో డీజిటల్ మార్కెట్ ఊపందుకుంటోంది. పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. లెక్కలేనన్ని యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అగ్ర నిర్మాతలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అలాంటప్పుడు సభ్యులను కాపాడుకోవడం సవాల్ గా మారుతోంది. ఇప్పుడిలాంటి మార్పులు మంచికే.

marsbahis girişmarsbahismarsbahis girişholiganbet girişjojobet giriş