పూజాకు దశతిరిగినట్లే కనిపిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యాష్ నెక్ట్స్ మూవీ నిర్మాతలు హీరోయిన్ కోసం పూజా హెగ్డేను కాంటాక్ట్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ నార్తన్. 2017లో అటు ఆడియన్స్, ఇటు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న కన్నడ్ ఫిల్మ్ ముఫ్తీకి అతనే డైరెక్టర్.
చెన్నై. హైదరాబాద్, ముంబైల చుట్టూ బిజిబిజీగా తిరిగే పూజా హెగ్డ్, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. అదికూడా యాష్ సినిమాలో. ఇది ఆమె డెబ్యూ మూవీ. పూజా అభిమానులకు కావాల్సింది అదే. రెండేళ్ల క్రితం వరకు ఆమె సినిమాలో ఉంటే అది స్మాష్ హిట్. ఇప్పుడు సీన్ రివర్స్. ఆమె సినిమాలన్నీ యావరేజ్ గా ఆడుతున్నాయి. పూజా ఐటెం సాంగ్ చేసిన ఎఫ్3 కూడా అంతే. ఆమె కెరీర్ నీరసంగా సాగుతోంది. సీనియర్లు అందరితోనూ ఆమె నటించేసింది. మరోసారి రిపీట్ చేయడానికి వాళ్లు రెడీగా లేరు. ఆమె ఫీజును ఇచ్చుకొనే స్థాయిలో మీడియం సినిమాలు లేవు. అందుకే రెమ్యునిరేషన్ ను ఏకంగా 5కోట్లు చేసింది.
కేజీఎఫ్ 2 తర్వాత యాష్ చేస్తున్న సినిమాలో పూజా హీరోయిన్. ప్రస్తుతానికి యాష్ 19 అని పేరుపెట్టారు.
అంతకుముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి ఆమె బైటకు వచ్చేసిందని టాక్ నడుస్తోంది. మహేష్ కు ఈ యేడాదిలో రాబోయే సినిమా అదే. కాని ఆమె టీం మాత్రం మహేష్ సినిమాలో ఆమె యాక్ట్ చేస్తోందని అంటున్నారు. కాకపోతే డేట్స్ సమస్య ఉందంట. ఇప్పుడు ఆమె ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్ పక్కన నటిస్తున్నట్లే.