iDreamPost
android-app
ios-app

OTT Premiers : ఇంటికొస్తున్న బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్

  • Published Mar 30, 2022 | 6:51 PM Updated Updated Apr 01, 2022 | 3:00 PM
  • Published Mar 30, 2022 | 6:51 PMUpdated Apr 01, 2022 | 3:00 PM
OTT Premiers : ఇంటికొస్తున్న బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా ఓటిటి రిలీజులకు రంగం సిద్ధమవుతోంది. పోటీ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంపెనీలన్నీ క్రమం తప్పకుండా కొత్త కంటెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఈ వీక్ ని డిజాస్టర్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. 31న ముందుగా ‘హే సినామిక’ రాబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. కాంబినేషన్ క్రేజీగా కనిపించినా సినిమా మరీ దారుణంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజుకే ఇది చాప చుట్టేసింది. కాకపోతే క్యాస్టింగ్ కి ఉన్న పేరు వల్ల ఓటిటిలో కాస్త బెటర్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ‘రాధే శ్యామ్’ని ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాక్ తెలిశాక కొన్ని కోట్ల ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లకుండా ఆగిపోయారు. సో ఒక్కసారి చూద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే ప్రైమ్ ఓపెన్ చేసి ప్రీమియర్ ఎంజాయ్ చేస్తారు. సినిమా బాగున్నా లేకపోయినా ఏదో ఒకటి కనీసం ఫార్వర్డ్ చేసుకుంటూ అయినా ఓ లుక్ వేస్తారు. ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్, గ్రాండియర్ గురించి ముందు నుంచి జరిగిన ప్రచారం వ్యూస్ ఎక్కువ రావడానికి హెల్ప్ అవ్వొచ్చు. వాస్తవానికి ముందు అనుకున్న డేట్ కంటే చాలా త్వరగా అంటే 22 రోజులకే ఇది డిజిటల్ లోకి రావడం ఊహించనిది

ఏప్రిల్ 2న సోనీ లివ్ లో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ టెలికాస్ట్ కానుంది. శర్వానంద్ రష్మిక మందన్న కాంబోలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. శర్వానంద్ డిజాస్టర్ రోని కంటిన్యూ చేసింది. కాకపోతే సినిమా నిండా లేడీస్ ఉన్నారు కాబట్టో ఇంట్లో చూసే ఆడియన్స్ ఎక్కువగానే ఉండొచ్చు. ఏప్రిల్ 1న మమ్ముట్టి లేటెస్ట్ మలయాళం బ్లాక్ బస్టర్ భీష్మ పర్వం హాట్ స్టార్ లో రానుంది. తెలుగు ఆడియో ఇవ్వకపోవచ్చు. ఏప్రిల్ 8 వచ్చే వారం ‘స్టాండ్ అప్ రాహుల్’ ఆహాలో వస్తుంది. మొత్తానికి ఈ నెల ఓటిటి బోణీ అంతా డిజాస్టర్లతోనే కొనసాగుతోంది. హిట్లన్నీ ఆల్రెడీ వచ్చేశాయి మరి

Also Read : Manchu Brothers : ఇంతకీ ఆ సినిమాలు వస్తాయా రావా

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet