iDreamPost
android-app
ios-app

Manchu Brothers : ఇంతకీ ఆ సినిమాలు వస్తాయా రావా

  • Published Mar 30, 2022 | 4:25 PM Updated Updated Mar 30, 2022 | 4:25 PM
  • Published Mar 30, 2022 | 4:25 PMUpdated Mar 30, 2022 | 4:25 PM
Manchu Brothers : ఇంతకీ ఆ సినిమాలు వస్తాయా రావా

గత ఏడాది మా ఎన్నికల టైంలో ప్రకాష్ రాజ్ తో వివాదం వల్ల బాగా హై లైట్ అయిపోయి ఫైనల్ గా ప్రెసిడెంట్ గా గెలిచిన మంచు విష్ణు ఆ తర్వాత ఆ సంఘం తరఫున ఏం చేస్తున్నారనే క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం గాలి నాగేశ్వరరావు(వర్కింగ్ టైటిల్)సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్ టైనర్ లో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనికన్నా చాలా ముందు మొదలైన ఢీ అంటే ఢీ(ఢీ సీక్వెల్)గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దర్శకుడు శ్రీను వైట్లతో అఫీషియల్ గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇంతకీ కొనసాగుతుందా లేదానే క్లారిటీ ఇప్పటిదాకా లేదు.

ఇక మంచు మనోజ్ అప్పట్లో అహం బ్రహ్మాస్మి అనే సినిమా అట్టహాసంగా మొదలుపెట్టడం అభిమానులకు గుర్తే. రామ్ చరణ్ అతిథిగా వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో మీడియాలోనూ దీని గురించి టాపిక్ వచ్చింది.న ఇది కంటిన్యూ చేస్తారా లేదా అనేది తెలియడం లేదు. వ్యక్తిగత జీవితంలో డిస్టర్బ్ అయ్యాక మనోజ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే జరిగిన విద్యానికేతన్ వార్షికోత్సవంలో మాట్లాడింది తప్ప పబ్లిక్ లోకి రావడం చాలా అరుదైపోయింది. ఫాంటసీ కం మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందాల్సిన అహం బ్రహ్మాస్మి హోల్డ్ లో పెట్టారా లేక పూర్తిగా వద్దనుకుని డ్రాప్ అయ్యారా ఓ ముక్క చెబితే బాగుండేది.

వీళ్లిద్దరి మార్కెట్ మీద ఆయా సినిమాల అపజయాల ప్రభావం తీవ్రంగా ఉంది. చాలా ఏళ్లుగా కనీస హిట్ లేకపోవడంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తి చూపించడం మానేశారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న గాలి నాగేశ్వరరావు తనకు కం బ్యాక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు విష్ణు. మరి మనోజ్ తర్వాతైనా కెమెరా ముందుకు వస్తాడా లేక పూర్తిగా సెలవు తీసుకున్నట్టేనా అనేది తెలియాల్సి ఉంది. ఆ మధ్య హయ్యర్ పర్పస్ అంటూ తను చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాంగా. ఏది ఏమైనా ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న మంచు సోదరులకు ఒకేసారి భారీ గ్యాప్ రావడం మాత్రం ట్విస్టే. ఈ ఏడాది అయినా ఎవరో ఒకరికి బ్రేక్ వస్తుందేమో

Also Read : RRR : ఆకాశమే హద్దుగా రామ్ భీమ్ రికార్డులు

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş