iDreamPost
android-app
ios-app

కెజిఎఫ్ దర్శకుడి బ్లాక్ ఫార్ములా

  • Published May 20, 2022 | 3:00 PM Updated Updated May 20, 2022 | 3:03 PM
కెజిఎఫ్ దర్శకుడి బ్లాక్ ఫార్ములా

కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టిందో చూస్తున్నాం. హిందీలో ఏకంగా అమీర్ ఖాన్ దంగల్ ని దాటేసి మరీ నెంబర్ వన్ స్థానంలో కూర్చుకున్న ఈ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అటు ఓటిటిలోనూ సంచలనాలు రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ఊపందుకుంది. ఈ ఏడాది విడుదల ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ వీలైనంత వేగంగా ఎక్కువ గ్యాప్స్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ 31వ సినిమా ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు. ఎక్కువ రివీల్ చేయలేదు కానీ సీరియస్ సబ్జెక్టనే హింట్ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ హ్యాంగోవర్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతి దాంట్లో డార్క్ బ్యాక్ గ్రౌండ్, నల్లగా మసిపూసినట్టు హీరో పాత్రలోని ఇంటెన్సిటీని చూపించేలా డీ గ్లామర్ టచ్ ఇవ్వడం ఇదంతా రెగ్యులర్ అయిపోతోంది. ఇది తప్పేమి కాదు కానీ కెజిఎఫ్ లో రాఖీ భాయ్ అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఎప్పుడూ మనమా నేపధ్యాన్ని చూడకపోవడమే. ఒకవేళ నీలే పదే పదే దీని సీక్వెల్స్ చేస్తూ పోతే ఒక స్టేజి దాటాక బోర్ కొట్టొచ్చు. అలాగే యష్ మీద బ్రహ్మాండంగా కుదిరిందని ప్రభాస్, తారక్ లను అదే స్టైల్ ని చూపించాలనుకోవడం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో రిలీజ్ అయితే కానీ క్లారిటీ రాదు. నార్త్ ఆడియన్స్ ఇలాంటి సెటప్స్ నచ్చుతున్న మాట వాస్తవం

ఉగ్రం అనే మీడియం బడ్జెట్ యాక్షన్ మూవీతో డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. కథా కథనాల కంటే ప్రేక్షకులకు కిక్కిచ్చే హీరో ఎలివేషన్లను అద్భుతంగా రాసుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ సలార్, ఎన్టీఆర్ 31 ఎలా డీల్ చేస్తాడోనని ఆసక్తికరంగా ఉంది. ఇదంతా ఓకే కానీ కన్నడిగులు మాత్రం తన మీద ఆగ్రహంగా ఉన్నారు. లైఫ్ ఇచ్చిన శాండల్ వుడ్ ని కాదని తెలుగు హీరోలతో ప్యాన్ ఇండియాలు ప్లాన్ చేసుకోవడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అతను అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు కానీ యష్ అంత స్టేచర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరోని కన్నడలో సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş