iDreamPost
android-app
ios-app

Acharya Collections ఆచార్య మొదటి రోజు వసూళ్లు

  • Published Apr 30, 2022 | 3:34 PM Updated Updated Apr 30, 2022 | 3:34 PM
Acharya Collections ఆచార్య మొదటి రోజు వసూళ్లు

ఊహించని విధంగా మొదటి ఆట నుంచే బ్యాడ్ టాక్ తో నడుస్తున్న ఆచార్య ఫలితం చిరంజీవి అభిమానులే కాదు సగటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇస్తోంది. దర్శకుడు కొరటాల శివ కాబట్టి కంటెంట్ ఎలా ఉన్నా కనీసం యావరేజ్ అయినా ఆడుతుందన్న ఆశలపై నీళ్లు జల్లుతూ షోలు గడిచే కొద్దీ స్పష్టమైన డ్రాప్ కనిపిస్తోంది. అయితే డ్యామేజ్ ఎంత శాతం ఉండొచ్చనేది కనీసం ఒక వారం ఆగితే క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆచార్య గురించి చర్చ వాడివేడిగా జరుగుతోంది. ట్రోలింగ్స్ మ్రోగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ సైతం తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు ఇలాంటి మూవీ వచ్చింది మరి.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు కావడంతో మెగాస్టార్ తన స్థాయి కాకపోయినా వచ్చిన టాక్ కి ఎదురీది మంచి వసూళ్లే రాబట్టారు. కాకపోతే 132 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ మెగా మూవీకి అది చేరుకోవడం దుర్లభమే. పోటీ ఏవీ లేకపోయినప్పటికీ దాన్ని వాడుకునే దిశగా కలెక్షన్లు కనిపించడం లేదు. ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో అర్బన్ ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనిపించేలా ఉన్నాయి. కానీ బిసి సెంటర్స్ రెస్పాన్స్ మాత్రం ఆందోళనకరంగానే ఉంది. ఖైదీ నెంబర్ 150 రెండు వారాలకే వంద కోట్ల మార్కుని దాటేయగా ఆచార్యకు మాత్రం ఇది అసాధ్యం. ఇక ఏరియాల వారిగా కలెక్షన్లు చూద్దాం

నైజామ్ – 7 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 4 కోట్ల 50 లక్షలు
ఉత్తరాంధ్ర – 3 కోట్ల 61 లక్షలు
ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 53 లక్షలు
వెస్ట్ గోదావరి – 2 కోట్ల 80 లక్షలు
గుంటూరు – 3 కోట్ల 66 లక్షలు
కృష్ణా – 1 కోటి 90 లక్షలు
నెల్లూరు – 2 కోట్ల 20 లక్షలు

ఏపి తెలంగాణ మొదటి రోజు షేర్ – 29 కోట్ల 10 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా- 1 కోటి 70 లక్షలు
ఓవర్సీస్ – 3 కోట్ల 85 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే షేర్ – 34 కోట్ల 65 లక్షలు

ఇది గ్రాస్ లెక్కలో చూసుకుంటే 52 కోట్ల దాకా వెళ్తుంది. పెద్ద మొత్తమే కానీ ఇంకా పాతిక శాతం రికవరీ కూడా అవ్వలేదు. మొదటి వారం చాలా కీలకంగా మారుతోంది. అడిగి మరీ పెంచుకున్న టికెట్ రేట్లు రివర్స్ లో బూమరాంగ్ లా తగులుతున్నాయి. సాధారణంగా ఉన్నా చిరంజీవి సినిమా కదా ఓసారి చూద్దామనుకునే మాస్ ప్రేక్షకులు ఉండేవాళ్ళు. కానీ ఈ టాక్ కి అంత డబ్బులు ఖర్చు పెట్టడమంటే ఆలోచిస్తారు. సో ఆచార్య నష్టం ఎంత ఉండబోతోందనే అంచనా ఇప్పుడే వేయలేం కానీ కొద్దిరోజులు ఆగి చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా టీమ్ మాత్రం సినిమా సూపర్ హిట్ అంటూ నిన్న సాయంత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap