iDreamPost
android-app
ios-app

అంథా నితిన్ కు దొరికిన జోడి

  • Published Aug 18, 2020 | 7:11 AM Updated Updated Aug 18, 2020 | 7:11 AM
అంథా నితిన్ కు దొరికిన జోడి

కొత్త పెళ్లికొడుకు నితిన్ ప్రస్తుతం రంగ్ దే బ్యాలన్స్ ని పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చే సంక్రాంతికంతా పరిస్థితి సాధారణం అవుతుందన్న నమ్మకంతో యూనిట్ రిలీజ్ కు ఆ సీజన్ నే టార్గెట్ చేసింది. కాకపోతే ఎంత లేదన్నా కనీసం ఓ నెలకు పైగానే వర్క్ ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు మొదలుపెట్టాలా అని ఎదురు చూస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం క్రేజ్ ని పెంచేసింది. ఇదిలా ఉండగా రంగ్ దే తర్వాత నితిన్ వరస ప్రాజెక్ట్స్ తో యమా బిజీ కాబోతున్నాడు. అందులో మొదటిది హిందీ బ్లాక్ బస్టర్ అందాధూన్ రీమేక్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో దీని తాలూకు పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరిగాయి.

లాక్ డౌన్ రాకపోయి ఉంటే రంగ్ దే విడుదలై ఇది సగం పైగానే షూటింగ్ పూర్తి చేసుకుని ఉండేది. ఇప్పటిదాకా క్యాస్టింగ్ లో బిజీ ఉన్న గాంధీ హీరోయిన్ ని లాక్ చేసినట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో అందరి దృష్టిలో పడ్డ నభ నటేష్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. డిస్కో రాజా నిరాశ పరిచాక తను ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరూ, అల్లుడు అదుర్స్ చేస్తోంది. ఈ రెండూ ఫైనల్ స్టేజిలో ఉన్నాయి. ఇప్పుడు నితిన్ సరసన ఆఫర్ అంటే వద్దంటుందా. ఒరిజినల్ వెర్షన్ లో రాధికా ఆప్టే చేసిన పాత్ర ఇది. ఇందులో గ్లామర్ కు పెద్ద స్కోప్ ఉండదు. పైగా కథ ఎక్కువ నితిన్ తో పాటు మరో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. ఇప్పుడు నభా ఎంటరవ్వడంతో పాటు నితిన్ ఇమేజ్ కు తగ్గట్టు కొన్ని మార్పులు అవసరం అవుతాయి కాబట్టి ఏమైనా చేస్తారేమో చూడాలి.

గత సినిమాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా నభా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఇచ్చే రోలే. నవంబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగ్ దే రిలీజ్ డేట్ ని బట్టి దీనికి తేదీని ఫిక్స్ చేస్తారు. ఎక్కువ అవుట్ డోర్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో త్వరగానే దీన్ని పూర్తి చేయొచ్చు. నానితో కృష్ణార్జునయుద్ధం రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్న మేర్లపాక గాంధీకి ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. అందాధూన్ వల్లే హీరో ఆయుష్మాన్ ఖురానా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నితిన్ కు ఆల్రెడీ ఉంది కానీ కళ్లులేని వాడిగా సరికొత్త పాత్ర ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు అందరి కన్నూ ఈ హిందీ సినిమాలో టబు చేసిన నెగటివ్ రోల్ ఇక్కడ ఎవరు చేస్తారా అనే దాని మీదే ఉంది