iDreamPost
android-app
ios-app

‘సలార్’లో కంప్లీట్ యాక్టర్ ?

  • Published Dec 14, 2020 | 12:40 PM Updated Updated Dec 14, 2020 | 12:40 PM
‘సలార్’లో కంప్లీట్ యాక్టర్ ?

ప్రస్తుతం రాధే శ్యామ్ పనుల్లోనే ఉన్నప్పటికీ డార్లింగ్ ప్రభాస్ మరోవైపు నెక్స్ట్ చేయబోయే మూడు సినిమాల వ్యవహారాలను కూడా చూసుకుంటున్నాడు. బాహుబలికి చేసిన ఐదేళ్ల త్యాగాన్ని పూడ్చుకునేలా వరసగా చిత్రాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. ఎన్ని సైన్ చేసినా కథలు వినడం మాత్రం మానడం లేదు. నచ్చిందా కొంత ఆలస్యమైనా చేసేద్దామని దర్శకులకు మాట ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందబోయే సలార్ గురించి పలు ఆసక్తికరమైన అప్ డేట్స్ బయటికి వస్తున్నాయి. బడ్జెట్ గురించి క్లారిటీ లేనప్పటికీ మరీ ఏడాది పొడవునా తీసేంత టైం తీసుకోరని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.

తాజా సమాచారం మేరకు సలార్ లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ టాక్. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆయనకు ఎంత అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యిందో చూసాం. సోలోగా మనమంతా చేస్తే చూడలేదు కానీ తమిళనాడులో కూడా విజయ్ జిల్లా బ్రహ్మాండంగా ఆడింది.ఇప్పటి జెనరేషన్ హీరోలతో మోహన్ లాల్ కాంబో బాగా పండుతోంది. అందుకే సలార్ లోనూ తనకో కీలక పాత్ర అది కూడా హీరో తర్వాత అంత ప్రాధాన్యం ఉండేదట. దాంతో ఆయన సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని చెన్నై టాక్.

ఇదే నిజమైతే సలార్ కు తమిళం, మలయాళంలో క్రేజ్ పెరుగుతుంది. డబ్బింగ్ చేసినా చాలు భారీ బిజినెస్ ఖాయం. అందుకే ప్రశాంత్ నీల్ ఈ ఆలోచన చేసాడట. అందులోనూ ప్రభాస్ కు యజమాని క్యారెక్టర్ అంటే మాములు నటులు చేస్తే ఆ వెయిట్ సరిపోదు. అందులోనూ డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక నార్త్ లో కూడా తన సినిమాల నుంచి చాలా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అదనపు ఆకర్షణలు తప్పవు. ఆది పురుష్ కంటే సలార్ ముందుగా పూర్తయ్యి విడుదలయ్యే అవకాశం ఉంది. 2021 వేసవిలో రాధే శ్యామ్, 2022 సంక్రాంతికి సలార్ రిలీజును ప్లాన్ చేస్తారట. ఇంతకంటే ఫ్యాన్స్ కు కావాల్సింది ఏముంది.