iDreamPost
android-app
ios-app

మా ప్రధాన లక్ష్యం అదే.. ప్రధాని నరేంద్ర మోదీ

మా ప్రధాన లక్ష్యం అదే.. ప్రధాని నరేంద్ర మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తమ ప్రభుత్వ ప్రథాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య 125వ వార్సికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని చెప్పారు.

వినూత్న ఆలోచనలతో అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేలా కరోనా సమయంలో ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ ప్యాకేజీ ప్రకటించామని గుర్తు చేశారు. 200 కోట్ల రూపాయలు లోపు ప్రభుత్వ కొనుగోళ్లు అన్నీ సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమల నుంచి కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలు మళ్లీ పుంజుకునేలా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. స్వదేశీ వస్తువులు కొనుగోళ్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్వదేశీ వస్తువుల కొనుగోలు పిలుపు ఇచ్చామని మోదీ పేర్కొన్నారు.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş