దీపావళి సందర్భంగా మోదీ ప్రభుత్వం భారీ బహుమతి ఇచ్చింది. అవును నిజమే, భారీ అని మనం అనుకోవాలి మరి. విషయం ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ దీపావళి సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి అని చెబుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణం. ప్రపంచ దేశాల్లో అన్ని రకాల ఇంధన కొరత, పెరిగిన ధరలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ కంటి తుడుపు మాటలు మాట్లాడుతోంది.
దేశంలో ఇంధన కొరత లేకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కృషి చేయడంతో కొంత రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు అమాత్యుల వారు. ఎందుకో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా కొద్ది రోజులుగా ఈ విషయం మీద జనానికి అవగాహన వచ్చింది. అందుకే ”ప్రతిరోజు 35 పైసలు fuel charges పెరుగుతూ ఉంటే…. నెలకి 10 రూపాయిలు సంవత్సరానికి 120 రూపాయిలు పెంచేలా ఉన్నారు… రోడ్ల మీద కొచ్చి ధర్నాలు చెయ్యక్కర్లేదు కానీ సోషల్ మీడియాలో మన గొంతు వినిపించాల్సిన టైం వచ్చింది. GST లిమిట్స్ లో fuel charges రావాలి అని అందరం కలిసి ఒకే నినాదం చేస్తే చాలా వరకు fuel cost సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. #FUELUNDERGST అని ప్రతి ఒక్కరు hashtags పెట్టి వారి గొంతును వినిపించాల్సిన అవసరం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈ message ని కాపీ చేసి మీ వాల్స్ పై post చెయ్యండి.” అంటూ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
ఈ పోస్టులు చూసే మోడీ అండ్ కో రేట్లు తగ్గించారా? అని అడగకండి. ఎందుకంటే సోషల్ మీడియా స్ట్రాటజీలతో గద్దెనెక్కిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ సుంకం తగ్గింపు అనేది కంటి తుడుపు చర్యే. పండుగ పేరు చెప్పి వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నమే. ఎందుకంటే పెట్రోల్ పై ఈ ఏడాది జనవరి 1st నుండి ఇప్పటికి Rs.27 పెంచారు, డీజిల్ కూడా అదే పరిస్థితి. అలా 27 రూపాయలు పెంచి రేపటి నుండి పెట్రోల్ పై Rs.5, డీజిల్ పై Rs.10 తగ్గిస్తుంది. ఒకరకంగా ఇది ప్రచారానికి తప్ప మరో ఆలోచనే లేని విషయం. అన్నట్టు ఇప్పుడు తగ్గించిన రేట్లు నాలుగే రోజుల్లో పెంచిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇది మోడీ సర్కార్ కాబట్టి. ఇది పెట్రో ప్రోడక్ట్స్ మీద వడ్డిస్తున్న టాక్స్ కు బ్రేక్ మాత్రమే.
Also Read : Chandrababu – Sunil Deodhar : బాబు ఆశలపై నీళ్లు చల్లిన సునీల్..!