ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లాగా చెబుతూ ఉంటారు. అందులో ఉండి నియోజకవర్హం విషయానికి వస్తే ఎన్నికల సమయాన ఎప్పుడూ అసక్తికరంగా మారుతూనే ఉంటుంది. ఎప్పుడో 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో రెండు సార్లు మినహా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీలు వేరయినా ఆ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేలు. కేవలం 1967, 1972లో మాత్రమే వేరే సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా పని చేశారు.
ఇక తెలుగుదేశం తరుపున 1983లో తొలిసారి కలిదిండి రామచంద్ర రాజు అలియాస్ అబ్బాయి రాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆతరువాత వరుసగా నాలుగు ఎన్నికలు మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్ ఆ తరువాత చంద్రబాబు వద్ద మంత్రిగా పని చేసారు.డబల్ హ్యాట్రిక్ ఖాయం అనుకున్నా 2004 ఎన్నికల్లో పరపతి సర్రాజు చేతిలో ఓటమి చవిచూశారు.
నిజానికి 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గంలో కొద్ది పాటి మార్పులు జరిగాయి. ఉండి, కాళ్ళ, ఆకివీడు మండలాలు అలాగే కొనసాగుతుండగా, భీమవరం నియోకవర్గం నుండి పాలకోడేరు మండలం కొత్తగా వచ్చి చేరింది. నిజానికి టీడీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలం టిడిపికి కంచుకోటగా ఉంది. టిడిపి ఆవిర్భావం తరువాత తొలిసారి 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎఫెక్ట్ తో పాతపాటి సర్రాజు 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇరవై వేల మెజారిటీతో గెలుపొందారు.
Also Read : వైయస్సార్ గురించి విప్లవ రచయిత అవంత్స ఏమన్నారు?
2009 ఎన్నికల్లో సీనియర్ అయిన కలిదిండి ని పక్కన పెట్టి యువకుడైన వేటుకూరి శివరామ రాజుకు చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చారు .కలవపూడి శివ అలియాస్ వేటుకూరి వెంకట శివరామరాజు 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టికెట్ దక్కని కలిదిండి రామచంద్ర రాజు కోటగిరి విద్యాధరావ్ ప్రభావంతో కొద్దికాలం ప్రజారాజ్యం కు మద్దతు ఇచ్చారు కానీ ఎన్నికల నాటికి సైలెంట్ అయ్యాడు.
ఉండి నియోజకవర్గానికి ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు ఎన్నికలు జరగ్గా..అందులో ఆరు సార్లు కాంగ్రెస్, టిడిపి ఏడు సార్లు గెలుపొందింది. రెండు సార్లు స్వతంత్ర సభ్యులు గెలిచారు. అయితే 2009 ఎన్నికల్లో శివరామరాజు చేతిలో ఓడిపోయిన పాతపాటి సర్రాజు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైసీపీ తీర్థం పుచ్చుకుని 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్తగా పీవీఎల్ నరసింహరాజు అనే నేతకి టికెట్ ఇచ్చారు. ఇక తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కలవపూడి శివను పార్లమెంట్ కు పంపడంతో టిడిపి మంతెన రామరాజు అనే నేతకు టికెట్ ఇచ్చింది.
ఏపీ మొత్తం ఫ్యాన్ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశానికి వర్కౌట్ అయింది. దాదాపు 10 వేల పైచిలుకు మెజారిటీతో నరసింహరాజు మీద రామరాజు గెలుపొందారు. అయితే ఒక రకంగా వైసీపీకి ఎక్కువ మంది నేతలు ఉండడంతో గెలుస్తుందనే భావించినా అక్కడ పరాజయం పాలు కావాల్సిన పరిస్థితి.
Also Read :బొడ్డు భాస్కర రామారావు పోవడంతో చిన రాజప్ప ఆ నియోజకవర్గంపై కన్నేశారా..?
మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నరసింహరాజు మధ్య వర్గ విభేదాలు వస్తున్నాయనే వార్తల నేపథ్యంలో జగన్ ఆసక్తికరంగా బీజేపీ నేత గోకరాజు గంగరాజు సోదరుడు గోకరాజు రామరాజుకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. వైసీపీ పరిస్థితి ఇలా ఉండగా టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజు మొదట్లో కాస్త ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినా ఆ తర్వాత పూర్తిగా కనపడని పరిస్థితి. నియోజకవర్గంలో కూడా పెద్దగా ఆయన బయటకు వస్తున్న వార్తలు అయితే కనపడటం లేదు, కేవలం సమావేశాలకు పరిమితం అవుతున్నారు తప్ప, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన కనిపించడం లేదు. ఒక పక్క జిల్లాలో ఉన్న మరో ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు జిల్లా అంతా తనదే అన్నట్టు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వాలి పోతూ మంచి పేరు తెచ్చుకుంటే ఎమ్మెల్యే రామ రాజు మాత్రం బయటికి పెద్దగా కనపడటం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడితేనే కదా మళ్ళీ ఓటర్లు ఓట్లు వేసి గెలిపించేది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన రామరాజు వచ్చే ఎన్నికలలో ఎలాంటి ఫలితాన్ని చవి చూడబోతున్నారో ఏమిటో?
అయితే వైసీపీ కూడా ఇప్పటికే వర్గ పోరు నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వివాదాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. జిల్లా మంత్రి రంగనాథ రాజు అండతో అభివృద్ధి పనులు చేయించుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడి నేతలు. ఇలాంటి సమయంలో కూడా మంతెన రామరాజు బయటకు రాకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారీ నష్టం చవి చూడటం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read : బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?