iDreamPost
android-app
ios-app

వైసీపీ కీలక నేతకు కరోనా

వైసీపీ కీలక నేతకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన మరో కీలక నేత కరోనా వైరస్‌ బారినపడ్డారు. వైసీపీ సీనియర్‌నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డికి వైరస్‌ సోకినట్లు నిర్థార అయింది. ఈ విషయం ఆయనే స్వయంగా తెలిపారు. భూమన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. భూమనతోపాటు ఆయన కుమారుడుకు కూడా వైరస్‌ సోకినట్లు సమాచారం. ఇప్పటికే పలువరు ఎమ్మెల్యేలు, మంత్రులకు వైరస్‌ సోకగా.. వారిలో చాలా మంది కోలుకున్నారు.

ప్రజల నుంచి వచ్చిన నేతగా పేరున్న భూమన కరుణాకర్‌ రెడ్డి.. ప్రస్తుత కరోనా ఆపత్కాంలోనూ తన నియోజకవర్గ ప్రజలకు వెన్నంటి ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఆపన్నహస్తం అందించారు. వైరస్‌ పోరులో ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉండే పారిశుధ్య కార్మికులతో కలసి తిరుపతి వీధులను శుభ్రం చేసి వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారు. కరోనా వైరస్, స్వియ రక్షణ చర్యలపై నియోజకవర్గ ప్రజలకు ఆయనే స్వయంగా అవగాహన కల్పించారు. ఇందు కోసం ఆటోల్లో తిరిగి మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. తమకు అన్ని విధాలుగా అండగా ఉండే భూమన కరుణాకర్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.