iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ బ్రహ్మాస్త్రలో భాగం కానున్న చిరంజీవి.. సూపర్ ప్లాన్ వేసిన రణబీర్..

  • Published Jun 13, 2022 | 8:14 PM Updated Updated Jun 13, 2022 | 8:27 PM
బాలీవుడ్ బ్రహ్మాస్త్రలో భాగం కానున్న చిరంజీవి.. సూపర్ ప్లాన్ వేసిన రణబీర్..

రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ 9న విడుదలకి ముహూర్తం పెట్టుకున్నా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేయనున్నారు. ఇక బ్రహ్మాస్త్రకి బాలీవుడ్ కాకుండా వేరే భాషల్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో అయితే ఓ రేంజ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు బ్రహ్మాస్త్ర టీం.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర టీమ్ దర్శకధీరుడు S.S రాజమౌళితో కలిసి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తుంది. గతంలో హైదరాబాద్ లో టైటిల్ లాంచ్, వైజాగ్ లో సాంగ్ లాంచ్ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. సినిమా టీం అంతా విచ్చేసారు. ఇందులో నాగార్జున ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు. సౌత్ లో ప్రచారం కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా రణబీర్ అన్నిరకాలుగా కష్టపడుతున్నాడు.

తాజాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని బరిలో దింపి తెలుగు రాష్ట్రాల్లో మరింత హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్రధాన పాత్రల్లో అయన్ ముఖర్జీ రూపొందిస్తున్న పాన్ ఇండియా బ్రహ్మాస్త్రా సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే హిందీలో ఈ సినిమాకి అమితాబ్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ వాయిస్ ఓవర్ కి సంబంధించిన డబ్బింగ్ కూడా అయిపోయినట్టు వీడియో రిలీజ్ చేశారు. చిరంజీవి వాయిస్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ స్పెషల్ థ్యాంక్స్ తెలియచేశారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş