iDreamPost
android-app
ios-app

Chiranjeevi : సంక్రాంతి బరిలో చిరంజీవి

  • Published Jun 24, 2022 | 4:05 PM Updated Updated Jun 24, 2022 | 4:05 PM
Chiranjeevi : సంక్రాంతి బరిలో చిరంజీవి

మెగాస్టార్ వ‌ర‌స‌పెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గ్యారెంటీ. ఈసారి సంక్రాంతికి సినిమా లాక్ అయ్యింది. ఆర్నెల‌లు ముందుగానే సంక్రాతికి డేట్ ఫిక్స్ చేశారు చిరంజీవి. బాబీ డైరెక్ష‌న్ త‌యావుతున్న సినిమాను , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా “కలుద్దాం సంక్రాంతికి” అనే క్యాప్షన్ తో, జనవరి 2023 అనే ట్యాగ్ లైన్ తో నిర్మాత‌లు పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో శృతిహ‌స‌న్ చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌లేదు. వాల్తేర్ వీర‌య్య అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తయార‌వుతున్న‌ ఈ సినిమాకు, ముందుగానే సంక్రాంతి ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు.

ఇప్పుడు సంక్రాంతికి బాబీ సినిమా అంటే, సెప్టెంబ‌ర్ నుంచి సంక్రాంతిలోపు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న‌ట్లే లెక్క‌. గాడ్ ఫాద‌ర్ సినిమా మీద మెగాస్టార్ కి మంచి న‌మ్మ‌క‌ముంది. ఆచార్య‌తో నీర‌స‌ప‌డిన ఫ్యాన్స్, గాడ్ ఫాద‌ర్ సినిమాతో హుషారుతెచ్చుకొంటార‌ని భావిస్తున్నారు. అది థియేటర్లలోకి వచ్చిన మూడునెల‌ల‌కే వాల్తేరు వీరయ్య రాబోతోంది. ఒక‌వేళ గాడ్ ఫాద‌ర్ హిట్ కొడితే, ఈ సినిమాకు బ‌జ్ మామూలుగా ఉండ‌దు.

గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు రెండూ రీమేక్ లే. చిరు-బాబి సినిమా మాత్రం స్ట్ర‌యిట్ సినిమా. చిరంజీవికి ఇది 154వ చిత్రం. దేవిశ్రీప్రసాద్ సంగీతం.

ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ పోటీకి దిగారు. వైష్ణవ్ తేజ్ సినిమాకూడా సంక్రాంతికి విడుదలకానుంది. అంతెందుకు, విజయ్-వంశీపైడిపల్లి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఎమోష‌న‌ల్ మూవీ వారసుడు కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. కాని చిరు సినిమాకు ఇవేమీ పోటీకాద‌నుకోవాలి.

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap