iDreamPost
android-app
ios-app

మాస్టర్ సూపర్ సేఫ్ : 7 రోజుల వసూళ్లు

  • Published Jan 20, 2021 | 5:11 AM Updated Updated Jan 20, 2021 | 5:11 AM
మాస్టర్ సూపర్ సేఫ్ : 7 రోజుల వసూళ్లు

ఏడాది మొత్తం మీద సంక్రాంతి పండగ సీజన్ టాలీవుడ్ కు ఎంత ముఖ్యమో మరోసారి ఋజువయ్యింది. సినిమాలో కంటెంట్ కాస్త అటు ఇటుగా ఉన్నా మంచి మార్కెటింగ్ తో పాటు బజ్ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న స్ట్రాటజీ విజయ్ మాస్టర్ కి బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. మొదటివారం ముగింపుకు వచ్చేసరికి ఏకంగా 13 కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్లడం ఇక్కడి మార్కెట్ లో ఈ హీరోకు ఇదే మొదటిసారి. అందులోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా ఇంత స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషమే. బయ్యర్లు ఎప్పుడో లాభాల్లోకి ప్రవేశించారు. తొమ్మిది కోట్ల కంటే తక్కువే బ్రేక్ ఈవెన్ ఉండటంతో అందరూ సేఫ్ అయ్యారు.

సగం సీట్లతోనే ఇంత రెవిన్యూ రావడం అంటే షాకే. ఒకవేళ మాస్టర్ కనక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుని ఉంటే ఈజీగా క్రాక్ ని దాటడమో దానికి ధీటైన పోటీ ఇవ్వడమో చేసేది. కానీ అలా జరగలేదు. అయితేనేం డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఫీలయ్యే ఫిగర్లు బాక్సాఫిస్ వద్ద నమోదయ్యాయి. ఇప్పటికైతే మాస్టర్ చాలా చోట్ల బాగా నెమ్మదించింది. లెక్కలు ఇలా ఉన్నాయి కానీ టాక్ అయితే మళ్ళీ పాజిటివ్ గా మారలేదు. మరోవైపు క్రాక్ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతూ స్క్రీన్లను కూడా పెంచుకుంది. ఒకరకంగా చూసుకుంటే మాస్టర్ ఫైనల్ రన్ కు అతి దగ్గరలో ఉన్నట్టే. ఇక ఏరియాల వారీగా 7 రోజుల వసూళ్లు చూద్దాం

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  3.10cr
సీడెడ్  2.49cr
ఉత్తరాంధ్ర  2.19cr
గుంటూరు  1.19cr
క్రిష్ణ  1.00cr
ఈస్ట్ గోదావరి  1.04cr
వెస్ట్ గోదావరి  1.18cr
నెల్లూరు  0.59cr
ఆంధ్ర+తెలంగాణా  12.80cr

ఇప్పుడీ ట్రెండ్ వల్ల రాబోయే విజయ్ సినిమాలకు తెలుగులో భారీ మార్కెట్ ఏర్పడటం ఖాయమని అర్థమైపోయింది. తుపాకీతో ఇక్కడ మొదటి బ్లాక్ బస్టర్ కొట్టినా విజయ్ ఫైనల్ షేర్ పది కోట్ల మార్క్ ఎప్పుడూ దాటలేదు. ఇప్పుడు మాస్టర్ తో సాధ్యమయ్యింది. ఇకపై దీన్ని బెంచ్ మార్క్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళంతో సహా ఇతర భాషలు అన్నింటిని కలుపుకుని మాస్టర్ ఇప్పటికే 100 కోట్ల మార్క్ దాటడం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. పాండెమిక్ లోనూ ఈ స్థాయి పెర్ఫార్మన్స్ చూపించడం బాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తెలుగు వరకు క్లోజింగ్ ఫిగర్స్ కోసం వెయిట్ చేయడమే తరువాయి.