iDreamPost
android-app
ios-app

Vikram Movie: విక్ర‌మ్ సినిమాలో సగం బ‌డ్జెట్ క‌మ‌ల్ హాస‌న్ దే!

  • Published Jun 01, 2022 | 7:52 PM Updated Updated Jun 01, 2022 | 7:55 PM
Vikram Movie: విక్ర‌మ్ సినిమాలో సగం బ‌డ్జెట్ క‌మ‌ల్ హాస‌న్ దే!

విక్రమ్ మూవీ రిలీజ్ ఒక్క‌రోజు ముందు ఒక్క‌సారిగా బ‌జ్ ను పెంచుకుంది. సూప‌ర్ స్టార్ కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన సినిమా విక్రమ్‌. హీరో సూర్యది అతిథి పాత్ర. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో, విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌ పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇది నిజానికి మ‌ల్టీస్టారర్ మూవీ. జూన్‌ 3న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతోపాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. మొత్తంమీద 150 కోట్ల బ‌డ్జెట్ అయిన ఈ సీనిమాను 200 కోట్ల మేర అమ్మేశారు. టేబుల్ ప్రాఫిక్ 50కోట్లు. మ‌రి ఏ హీరోకి ఎంత రెమ్యునిరేష‌న్ వ‌చ్చింది?

క‌మ‌ల్ హాస‌న్ సూప‌ర్ స్టార్ రేంజ్ లోనే రెమ్యునిరేష‌న్ తీసుకున్నారు. రూ.50కోట్లు ఆయ‌న‌కు అందింది. డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్ కు రూ.8 కోట్లుమేర బ్యాంక్ బాలెన్స్ పెరిగింది. విజయ్‌ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌కు రూ.4 కోట్ల మేర పారితోషికం ఇచ్చారు. అంతెందుకు మంచి మ్యాజిక్ ఇచ్చిన అనిరుధ్‌ రవిచందర్‌కు రూ. 4 కోట్లు ముట్టజెప్పారట.

విక్ర‌మ్ సినిమాకు మూలం కమల్‌ హాసన్‌. 2018 ఆగస్టులో వ‌చ్చిన విశ్వరూపం 2 సినిమా త‌ర్వాత ఇదే మ‌ళ్లీ వెండితెర మీద ఆయ‌న‌ క‌నిపించ‌డం. అందుకే ఈ సినిమాపై మంచి బ‌జ్ ఉంది. చాలా ఇంటెన్సీవ్ గా, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రానుంది. ఈ సినిమా క‌నుక హిట్ కొడితే క‌న‌క‌రాజ్ మ‌రో పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ కానున్నారు.

Jojobet GirişmeritbetholiganbetCasibom girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibom girişatombet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş