భారతీయ సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో కల్ట్ క్లాసిక్స్ అనదగ్గ చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపధ్యంతో వందల వేలు రూపొందినప్పటికీ కొన్ని మాత్రమే ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటివాళ్లు ఈ జానర్ లో తమదైన ముద్ర వేశారు. జనతా గ్యారేజ్ లో నటించితెలుగువాళ్ళకు దగ్గరైన కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా మూడు దశాబ్దాల క్రితం అలా నిలిచిపోయే సినిమా ఒకటి మలయాళంలో చేశారు. అదే అభిమన్యు. 1991లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళ్ లోనూ డబ్బింగ్ రూపంలో ఘన విజయం అందుకుంది.
నిజానికిది అప్పటికే వచ్చిన నాయకుడు, సురేష్ కృష్ణ సత్య, శివ, అర్జున్ పండిట్ ఛాయల్లో సాగుతుంది. అయినప్పటికీ ప్రియదర్శన్ వాటి తలపు రాకుండా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. పొట్టకూటి కోసం ముంబై వచ్చిన హరికృష్ణ అనే యువకుడు స్థానిక దాదాల ఆగడాలు భరించలేక వాళ్ళకు ఎదురు తిరిగి తనే ఒక వ్యవస్థగా మారతాడు. దీంతో జనం హరి అన్నా అంటూ ఇతనికి పట్టడం కడతారు. ప్రత్యర్థి ఎంత శక్తివంతుడైనా మట్టికురిపించిన అభిమన్యు చివరికి ఓ చిన్న అపార్థం వల్ల స్నేహితుడు చేసిన ద్రోహానికి పోలీసులు కాల్పులకు బలవుతాడు. నేరానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించాల్సిందే అన్న సందేశంతో అభిమన్యు తన ప్రస్థానాన్ని ముగిస్తాడు. సినిమా ఆద్యంతం ఒకే టోన్ లో సాగుతుంది. వేశ్యగా తీర్చిదిద్దిన హీరోయిన్ పాత్రను గీత పోషించగా మనకూ పరిచయమున్న అంకుశం రామిరెడ్డి, ముఖేష్ ఆనంద్ లు మెయిన్ విలన్లుగా నటించారు.
రేసీ స్క్రీన్ ప్లేకి తోడు జాన్సన్ నేపధ్య సంగీతం దీనికి బాగా హెల్ప్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్టు విజయ్ కుమార్ భార్య అలనాటి కథానాయికి మంజుల ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. దీనికి గాను మోహన్ లాల్ కు బెస్ట్ యాక్టర్ గా స్టేట్ అవార్డు వచ్చింది. 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీన్ని తమిళంలో సుందర్ హీరోగా తలై నగరం పేరుతో రీమేక్ చేశారు. అంతగా కల్ట్ స్టేటస్ సంపాదించుకున్న అభిమన్యు ఇక్కడ కూడా బాగానే ఆడింది. మోహన్ లాల్ 90వ దశకంలో వరసగా డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాతే క్రమక్రమంగా పట్టు కోల్పోయారు.దీని సంగతి అలా ఉంచితే ఆ తర్వాత ఎన్ని మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చినా అభిమన్యు మాత్రం స్పెషల్ గా నిలిచిపోయింది. ఒకరకంగా చూస్తే ఇదే షేడ్స్ లో ప్రభాస్ యోగి కథ కూడా సాగుతుంది. మదర్ సెంటిమెంట్ ఎక్కువవ్వడంతో ఎందుకో మనవాళ్ళకు కనెక్ట్ కాలేదు. ఎన్ని తరాలైనా శివ, అభిమన్యు, గాయం, నాయకుడు లాంటి మాఫియా బయోపిక్స్ యంగ్ ఫిలిం మేకర్స్ కు మంచి లెసన్స్ గా నిలుస్తాయి.