iDreamPost
android-app
ios-app

మా’ పీఠం మంచు విష్ణుదే !

మా’ పీఠం మంచు విష్ణుదే !

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయ నాయకులను మరిపించే విధంగా ఆరోపణలు, వాగ్దానాలు చేసుకుంటూ సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు తుది అంకానికి చేరుకుంది. మునుపెన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతానికి పైగా పోలింగ్ కూడా జరిగింది. పైకి మేము అందరం ఒకటే అని చెబుతున్నా తెలుగు సినిమా పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయి ఈ ఎన్నికల కోసం పోటీ పడ్డారనేది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలో ఈ ఎన్నికల ఫలితాల మీద కేవలం సినీ వర్గాలకే కాక రెండు తెలుగు రాష్ట్రాల సాధారణ ప్రజల్లో కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొంది..

ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మొదలైన పోలింగ్ రెండు గంటల వరకు జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో మూడు గంటల వరకు పొడిగించారు. ఇక రాత్రి ఎనిమిది గంటలకు ఖచ్చితంగా ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరిగినా ఎన్నికల ఫలితాలు లేట్ అయ్యాయి. ఇక ఎట్టకేలకు ఉత్కంఠతతో సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీద మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. అయితే మంచు విష్ణు అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల అధికారి నుంచి ప్రకటన రాకపోయినా అందుతున్న సమాచారం మేరకు ప్రకాష్ రాజు మీద 400 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలిచినట్లు చెబుతున్నారు.

మంచు విష్ణు గెలవడంతో విష్ణు ప్యానల్ సభ్యులందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇక విష్ణు ప్యానల్ లో కూడా దాదాపు 10 మంది ప్యానల్ సభ్యులు లీడింగ్లో ఉన్నారు. ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి ప్రస్తుతానికి శ్రీకాంత్ బాబు మోహన్ మీద లీడ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ చివరికి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్, సురేష్ కొండేటి, అనసూయ గెలుపొందారు. ఇక ప్రకాష్ రాజు ప్యానల్ లో గెలుపొందిన సభ్యులు కూడా మంచు విష్ణు అధ్యక్షుడు అయితే మంచు విష్ణు ఆధ్వర్యంలోని పనిచేయాల్సి ఉంటుందన్నా సంగతి తెలిసిందే.