iDreamPost
android-app
ios-app

భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్‌ రెండో పెళ్లి?

  • Published Sep 05, 2022 | 10:27 AM Updated Updated Sep 05, 2022 | 10:32 AM
భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్‌ రెండో పెళ్లి?

హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? భూమా నాగిరెడ్డి, భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్‌ రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫ‌ల‌మండిలోని వినాయ‌కున్ని దర్శించుకొని పూజలు చేశారు.

గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద మౌనికారెడ్డితో క‌లిసి పూజ‌లు చేసిన మంచు మ‌నోజ్‌ను పెళ్లి విష‌య‌మై మీడియా అడ‌గ‌గా, పెళ్లి త‌న వ్య‌క్తిగ‌త అంశం. స‌మ‌యం వ‌చ్చిన‌పుడు చెబుతాన‌న్నారు. అంతే త‌ప్ప‌, పెళ్లి వార్త‌ల‌ను మ‌నోజ్ ఖండించ‌లేదు.


ఇదివరకే మంచు మనోజ్‌ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి, 2015లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్‌ సినిమాలకు కూడా కాస్త గ్యాప్‌ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మంచు మనోజ్‌ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గ‌ట్టిగా ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతెందుకు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని పెద్ద‌ రాజ‌కీయ కుటుంబానికి చెందిన యువ‌తిని, హీరో మంచు మ‌నోజ్ పెళ్లాడ‌నున్న‌ట్టు రాయ‌ల‌సీమ రాజ‌కీయ‌నాయ‌కుల్లో కొద్దికాలంగా నానుతోంది.

ప్ర‌ణతితో మ‌నోజ్ విడాకులు త‌ర్వాత ఆయ‌న రెండో పెళ్లిపై వార్త‌లు వినిపించినా, వాటిని ఖండిస్తూ వ‌చ్చారు. ఇక‌, భూమా మౌనికారెడ్డి బెంగ‌ళూరుకు చెందిన గ‌ణేష్‌రెడ్డితో మొద‌టి వివాహం జ‌రిగింది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితమే గ‌ణేష్‌తో మౌనికా విడాకులు తీసుకున్నారు. అనంత‌రం మౌనికారెడ్డి హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. ఇద్దిరి మ‌ధ్య కొద్దికాలంగా స్నేహం, అనుబంధం పెరిగింద‌ని స‌న్నిహితుల మాట‌. దానికితోడు మంచు మోహ‌న్‌బాబు కుటుంబంతో మ‌నోజ్ దూరంగా ఉంటున్నారు.

అఖిల‌ప్రియ చెల్లి భూమా మౌనికారెడ్డికి రాజ‌కీయాలంటే ఆస‌క్తి. బాగా మాట్లాడ్తార‌ని, కార్య‌క‌ర్త‌ల‌తో అభిమానంగా వుంటార‌ని ఆళ్ల‌గ‌డ్డ‌ మాట‌. అంతెందుకు హైద‌రాబాద్ కిడ్నాప్ కేసులో అఖిల‌ప్రియ జైలుకెళ్లిన‌ప్పుడు మౌనికారెడ్డి ఆళ్ల‌గ‌డ్డ వెళ్లారు. మీడియా ముందుకు ధైర్యంగా వ‌చ్చారు. అక్క‌లేక‌పోయినా, తానున్నానన్న భ‌రోసా కార్య‌కర్త‌లకివ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. కాని కుటుంబ ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో మౌనిక రాక‌ను అఖిల‌ప్రియ అంగీక‌రించ‌లేద‌ని, అందుకే మౌనిక మ‌ళ్లీ ఆళ్ల‌గ‌డ్డ వైపు చూడ‌లేదని అంటారు.

మంచు మ‌నోజ్ రాజ‌కీయ‌, కుటుంబ నేప‌థ్యం బ‌ల‌మైందే. మ‌నోజ్ క‌నుక అండ‌గా నిల‌బ‌డితే మౌనిక మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి కీల‌కంగా మారొచ్చ‌న్న‌ది అంచ‌నా. అందుకే మ‌నోజ్‌త‌న‌ పెళ్లి, రాజ‌కీయ ప్ర‌వేశం గురించి త్వ‌ర‌లో చెబుతాన‌న్న వ్యాఖ్య‌ల వెనుక మౌనిక ఉన్నార‌ని ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomromabetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap