iDreamPost
android-app
ios-app

మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్ – రజనీకి స్వల్ప గాయాలు

మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్ –  రజనీకి స్వల్ప గాయాలు

ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్‌ సాహసవీరుడు బేర్‌గ్రిల్స్‌తో బందీపూర్‌ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు.. ఈ క్రమంలో షూటింగ్ లో పాల్గొన్న రజనీకాంత్‌కు చిన్నపాటి గాయాలైనట్లు అక్కడి అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే చిన్న చిన్న గాయాలు మాత్రమేనని, ఏ విధమైన ప్రమాదం లేదని ఆయన సురక్షితంగా ఉన్నారని ప్రస్తుతం ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని రజనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read Also: మొన్న ఒబామా .. నిన్న మోడీ.. నేడు రజని

ప్రస్తుతం రజినీకి గాయాలు అయిన నేపథ్యంలో రేపటి షూటింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజినీకి తగిలిన చిన్న గాయం మానిపోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం రజనీకి ఈ వయసులో అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş