iDreamPost
android-app
ios-app

తృణముల్ కోటపై గుజరాత్ బాణం!

తృణముల్ కోటపై గుజరాత్ బాణం!

ఎన్నడూ లేనంత ఆసక్తిని రేపుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ ఎత్తులు సాగుతున్నాయి. తాజాగా మమతా దీదీ పై బీజేపీ గుజరాత్ మూలాలు కలిగిన అస్త్రాన్ని వదిలింది. సొంత పార్టీ రాజ్యసభ ఎంపీ దినేష్ త్రివేది తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సాక్షిగా మమతా బెనర్జీ పాలనపై అక్కసును వెళ్లగక్కారు.

మొదటి నుంచి తృణమూల్ వాదే!

దినేష్ త్రివేది మొదటినుంచి తృణమూల్ కాంగ్రెస్కు తురుపుముక్క లా ఉన్నారు. 1980లో కాంగ్రెస్ లో చేరిన ఆయన, తర్వాత జనతా దళ్ పక్షాన నిలబడ్డారు. 1998లో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రస్థానం మొదలుపెట్టిన దగ్గరనుంచి ఆమెకు నమ్మిన బంటుల దినేష్ త్రివేదీ పనిచేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు మొదటి ప్రధాన కార్యదర్శి గాను ఈయన పని చేశారు.

రైల్వే మంత్రిగా సేవలు!

1990 నుంచి 1996 వరకూ దినేష్ త్రివేది జనతాదళ్ పార్టీ తరఫున గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన 2002 నుంచి 2008 వరకూ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గా పనిచేసారు. 2009లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరక్ పూర్ నుంచి గెలిచి మన్మోహన్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసారు. 2011లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచి, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా వచ్చిన తర్వాత కేంద్రంలో అప్పటివరకు ఆమె నిర్వహించిన రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేదిను ఆమె నియమించారు.

రైల్వే మంత్రిగా పెద్ద వివాదం

దినేష్ త్రివేదీ రైల్వే మంత్రిగా పనిచేస్తున్న సమయంలో 2012 రైల్వే బడ్జెట్ పెద్ద వివాదానికి దారి తీసింది. రైల్వే ప్రయాణికుల టికెట్ ధరలు ఎన్నడూ లేనంతగా పెంచడం విమర్శల పాలు చేసింది. ఏకంగా కిలోమీటర్ కు 2 పైసల నుంచి 30 పైసల వరకూ వివిధ కేటగిరీలుగా టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. త్రివేది నిర్ణయాన్ని సొంత పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం వ్యతిరేకించడం అప్పట్లో కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం మళ్లీ వెనక్కు తగ్గి టిక్కెట్ ధరలను తగ్గించి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టింది.

గుజరాత్ మూలాలు!

పాకిస్థాన్లోని కరాచీ మూలాలు ఉన్న దినేష్ త్రివేది కుటుంబం భారత విభజన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కొన్నాళ్ళు జీవించారు. గుజరాతి కుటుంబం కావడంతో పాటు తండ్రి ఉద్యోగ రీత్యా వేరే దగ్గర త్రివేది మరో దగ్గర చదువుకున్నారు. కోల్కతాలో డిగ్రీ విద్యను పూర్తి చేసి విదేశాల్లో మాస్టర్స్ పూర్తిచేసిన త్రివేది మొదటి నుంచి గుజరాతి మమకారాన్ని చంపుకోలేకపోయారు. తమ తండ్రులూ గుజరాతీయులు గా పదే పదే గుర్తు చేసుకొనే త్రివేది ప్రస్తుతం కీలకమైన సమయంలో మమత పాలన మీద విరుచుకు పడడం ద్వారా బిజెపి ను శాసిస్తున్న గుజరాతి నాయకులకు సానుభూతి పరుడు గా మారిపోయారు. దీనిపై తృణముల్ కాంగ్రెస్ నాయకులు సైతం పశ్చిమ బెంగాల్ లో గుజరాతీలు ఇమడ లేరని వ్యాఖ్యానిస్తున్నారు.

తృణముల్ కు దెబ్బే!

దినేష్ త్రివేది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు దూరమైనట్లు లఅని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ కు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించిన దినేష్ త్రివేది ఈ సమయంలో ప్లేట్ ఫిరాయిస్తారని మమతా ఊహించలేదు. కోల్కతా ను ఆనుకొని ఉండే బరక్ పూర్ నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన దినేష్ త్రివేది కు తృణమూల్ పార్టీ లో పాత మిత్రులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీ తర్వాత పార్టీలో నెంబర్ టు గా వెలుగొందిన ఆయనను చాలా మంది సీనియర్ గా గౌరవిస్తారు. ఇప్పుడు పార్టీ మీద బాహాటంగా చట్టసభ లోనే విమర్శలు చేసిన ఆయనతో ఎంతమంది వస్తారు? పార్టీ కు దినేష్ త్రివేది చేసే నష్టం ఎంత అనే లెక్కలను అప్పుడే బిజెపి వేస్తోంది. ఆయనతో మాట్లాడి బీజేపీ వైపు తీసుకొచ్చే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ తృణమూల్ లో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బీజేపీ లోకి రావడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త సంచలనం అవుతోంది. మరి దినేష్ త్రివేది బిజెపి వైపు వస్తారా నాకు తటస్థంగా ఉండి పోతారా అన్నది తెలియాలి.