iDreamPost
iDreamPost
సర్కారు వారి పాట షూటింగ్ ని అమెరికాలో మొదలుపెట్టేందుకు ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దాని కోసం నాన్ స్టాప్ గా కాల్ షీట్స్ కేటాయించబోతున్నాడు. ప్రస్తుతానికి జనవరి షెడ్యూల్ ని పెండింగ్ లో పెట్టేసి ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. కొంత భాగం మొదట హైదరాబాద్ లోనే చిత్రీకరించబోతున్నారట. మరోవైపు రంగ్ దే ఫైనల్ షూట్ లో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ సర్కారు కోసం బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. యూనిట్ వేచి చూడడానికి ఇది కూడా ఒక కారణమే. ఎంత వేగంగా షూటింగ్ చేసినా సర్కారు వారి పాటను వచ్చే ఏడాది విడుదల చేయడం అనుమానంగానే ఉంది.
దీని సంగతలా ఉంచితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ ఎవరితో చేస్తారనే విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదు. రాజమౌళి స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. అయితే ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా ఒక్కో సినిమాకు కనీసం మూడేళ్ళకు పైగా టైం తీసుకుంటున్న జక్కన్నతో ప్రిన్స్ ఒక్కసారి టై అప్ అయితే అంత సమయం బ్లాక్ అవుతాడేమో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే మహేష్ కోసం రాజమౌళి రాయిస్తున్నది ఫాంటసీ కథ కాదట. ఛత్రపతి, విక్రమార్కుడు తరహాలో యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్.
అయినా కూడా వేగంగా చేస్తారని నమ్మడానికి లేదు. అయితే మహేష్ కు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ విడుదలవ్వడానికి ఇంకో ఏడాది పైగానే పట్టేలా ఉంది. ఆపై తన స్క్రిప్ట్ ని ఫైనల్ గా లాక్ చేయడానికి రాజమౌళికి ఎంత లేదన్నా ఆరు నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. ఈలోగా ఇంకో దర్శకుడితో ఒకటో లేదా రెండు సినిమాలు సరిలేరు నీకెవ్వరు తరహాలో ఫాస్ట్ గా ప్లాన్ చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇదంతా తేలేందుకు టైం అయితే పట్టేలా ఉంది. ఆర్ఆర్ఆర్ జరుగుతున్న తీరు చూస్తుంటే వచ్చే ఏడాది మిస్ అయితే 2022 సంక్రాంతి తప్ప విడుదలకు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఉండదు.