iDreamPost
android-app
ios-app

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. మాట్లాడుతూ ఎమోషనల్ అయిన మహేష్..

  • Published May 08, 2022 | 12:28 PM Updated Updated May 08, 2022 | 12:28 PM
సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. మాట్లాడుతూ ఎమోషనల్ అయిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరించాయి, యూట్యూబ్ లో రికార్డులని సృష్టించాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మే 7న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో వేలాది మంది అభిమానుల మధ్య గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ మొదట సినిమా గురించి, సినిమాకి పని చేసిన వారి గురించి చెప్పారు. తన స్టైల్ లో కూల్ గా, నవ్వుతూ మాట్లాడారు. ఆ తర్వాత అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ… మిమ్మల్నందరిని కలిసి రెండేళ్లపైనే అయింది. మళ్లీ మనం ఇలా సినిమా ఫంక్షన్ లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని డైరెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. నా ఫేవరేట్ క్యారెక్టర్స్ లో ఇది ఒకటిగా మిగులుతుంది. ఈ సినిమా చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయి అని అన్నారు.

అలాగే కరోనా సమయంలో మహేష్ అన్నయ్య రమేష్ మరణించారు. ఆ సంఘటన తలుచుకొని.. కరోనా వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు బాగా దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. కానీ ఎంతమంది దూరమైనా, ఏం జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం ఒక్కటి చాలు ధైర్యంగా నడవటానికి అంటూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. మహేష్ భావోగ్వేదానికి గురవ్వడం చూసి అభిమానులు కూడా చలించిపోయారు.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş