iDreamPost
android-app
ios-app

మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేది మేమే

మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేది మేమే

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశానని శరద్ పవార్ అన్నారు.వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్ రావు చవాన్ వర్ధంతి కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొని, “ప్రీతి సంగమ్” వద్ద నివాళులు అర్పించారు. మహారాష్ట్రలో నెలకొన్న అనూహ్య పరిణామాలపై శరద్ పవార్ ని వివరణ అడగగా, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎన్నో వస్తాయని కానీ అవన్నీ తాత్కాలికమే అని శరద్ పవార్ మీడియాతో అన్నారు. బీజేపీతో చేతులు కలిపింది అజిత్ పవారే కానీ ఎన్సీపీ కాదని శరద్ పవార్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ తో టచ్ లో లేనని, పార్టీ నేతలతో చర్చించి అజిత్ పవార్ ని పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేది శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమేనని శరద్ పవార్ మీడియాకి స్పష్టం చేసారు.

అయితే బిజెపి ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో కలిసి మహారాష్ట్రలో 23వ తేదీ తెల్లవారుజామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ నేతలు భగ్గమన్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని సుప్రీం కోర్ట్ లో పిటిషన్ కూడా దాఖలైంది. దీనికి సంబంధించిన తుదితీర్పు మంగళవారం ఉదయం 10.30కి సుప్రీంకోర్ట్ వెలువరించనుంది.