iDreamPost
iDreamPost
కారు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్ బ్రేకర్. స్లోగా వెళ్తున్నా పెద్ద శబ్ధం. కారు కదలడంలేదు. గేరు మార్చినా అంతే. అదిరిపడ్డాడు డ్రైవర్. కిందకు దిగి చూస్తే..
భోపాల్ లో కారు హైస్పీడు కంట్రోల్ మీద చిక్కుకుపోయింది. ముందుకీ వెనక్కి కదలడంలేదు. డ్రైవర్ నిస్సహాయంగా నిలబడ్డాడు. ఈ మొత్తం తతంగాన్ని అభిషేక్, ఫోటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మాస్టర్ పీస్ గా వెటకరించాడు.
కార్ సేఫ్టీ అంటే డ్రైవర్ జాగ్రత్తగా నడపడమేకాదు, రోడ్లుకూడా బాగుండాలి. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్లు. రద్దీ ప్లేస్లులో, ఇళ్ల దగ్గర వేహికల్స్ స్పీడుగా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికే స్పీడు బ్రేకర్లుంటాయి. కాని మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో, speed breaker ఇంటర్నెట్ లో యమ పాపులర్ అయ్యింది.
ఈ కార్ ఓనర్ పేరు అభిషేక్. తన Kia Seltos SUV స్పీడ్ బ్రేకర్ మీద ఇరుక్కుపోయింది. వేహికల్ ని బైటకు తీయడంకోసం గంటల కొద్దీ ట్రైచేశాడు. కిందామీద పడ్డాడు. అయినా అతని వళ్ల కాలేదు. చేసేదిలేక టోయింగ్ వేన్ కు కాల్ చేశాడు.
ఇలాంటి స్పీడు బ్రేకర్ కట్టిన ఇంజనీర్ కు బిగ్ సెల్యూట్. చాలాకార్లు ఇలాంటి స్పీడు బ్రేకర్ల వల్ల దెబ్బతింటున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడంలేదుని కార్ ఓనర్ పోస్ట్ చేశాడు.
స్పీడు బ్రేకర్ మీద ఊగుతున్నకారు ఫోటోను ట్విట్టర్ చాలా మంది షేర్ చేశారు. Kia Seltos చాలా పాపులర్ కారు. గ్రౌండ్ క్లియరెన్స్ 190mm. అంటే చాలా ఎత్తైన కార్. కాని కింద ఫోటో చూస్తే, రోడ్డకడ్డంగా పెద్ద కాంక్రీట్ దిమ్మ వేసినట్లుగానే ఉంది. ఇది చిన్నసైజు గోడకాని, స్పీడు బ్రేకర్ కాదు. ఇంత నిర్లక్ష్యమా?
स्पीडब्रेकर कैसे बनाए जाएं ?
तस्वीर सिर्फ हास्य के लिए नहीं, बल्कि देश में उच्च स्तर पर बैठे जनप्रतिनिधियों और जिम्मेदार अधिकारियों के संज्ञान के लिए है
जिसने भी इसे बनाया, ठेकेदार-इंजीनियर से नुकसान की भरपाई होना चाहिए @ChouhanShivraj @bhupendrasingho @CMMadhyaPradesh pic.twitter.com/upy5aO7yyd— D. Gopaal Rao (डी. गोपाल राव) (@activistDGR) June 20, 2022
గత వారం కాలిఫోర్నియాలో స్పీడ్ బంప్స్ మీద పైకెగిర కారు వీడియో చాలా పాపులర్ అయ్యింది. దీనిని నెటిజన్స్ పెట్టిన పేరు ‘Speed Bump Olympics’.
రెండు స్పీడ్ బంప్స్ అంటే స్పీడు బ్రేకర్ల మధ్య దూరం 10 అడుగులు. ఒక్కదాని ఎత్తు ఐదు అంగుళాలు. వీటిమీద వెళ్తుంటే కార్లు ఎగిరెగిరిపడుతున్నాయి.
ఇలాంటి స్పీడు బ్రేకర్ల దెబ్బకి, వేహికల్స్ సస్పెన్షన్ దెబ్బతింటే కనీసం రూ.25వేల నష్టం. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు?