iDreamPost
android-app
ios-app

విలక్షణ నటుడి మూడో ప్రయత్నం

  • Published Jun 03, 2021 | 6:48 AM Updated Updated Jun 03, 2021 | 6:48 AM
విలక్షణ నటుడి మూడో ప్రయత్నం

ఈ ఏడాది రెడ్ తో భారీగా కాకపోయినా డీసెంట్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బ్రేక్ పడకపోయి ఉంటే ఇప్పటికి ఓ పాతిక శాతం దాకా పూర్తయ్యేది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగానే వేగంగా షూటింగ్ జరిపేందుకు పక్కా ప్లానింగ్ తో ఉంది టీమ్. ఇందులో రామ్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. రెగ్యులర్ ఖాకీ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ లో లింగుస్వామి రామ్ ని ఇందులో ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి. దీనికి ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంటుందని గతంలోనే వార్త వచ్చింది.

ఇందులో చాలా కీలకమైన విలన్ పాత్రకు తమిళ నటుడు మాధవన్ ని అడిగిట్టు ఫ్రెష్ అప్ డేట్. తనకు ఈ మధ్య టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు అంతగా కలిసి రావడం లేదు. నాగచైతన్యతో సవ్యసాచి, అనుష్కతో నిశ్శబ్దం రెండూ ఒకదాన్ని మించి మరొకటి ఫెయిలయ్యాయి. అందుకే ఇతను మన దర్శకులకు తొందరపడి సైన్ చేయడం లేదు. కానీ లింగుస్వామి కేసు వేరు. ఇతను తమిళుడు. అంతకన్నా మించి మాధవన్ కి మాస్ లో గుర్తింపు వచ్చేలా మొదటి బ్రేక్ ఇచ్చిన మూవీ రన్ దర్శకుడు లింగుస్వామినే. అప్పట్లోనే రెండు భాషల్లో విడుదల చేయడం కోసం సునీల్ తో సెపరేట్ ట్రాక్ తీశారు ఈయన.

సో ఇది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాధవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. దీన్ని కూడా మల్టీ లాంగ్వేజ్ లో పాన్ ఇండియా కలర్ తో నిర్మిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కావడంతో ఆ కోణంలో కూడా అదనపు హైప్ వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ఫిక్స్ చేసుకున్నారు కానీ పరిస్థితులు ఎంత మేరకు అనుకూలిస్తాయనే దాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన మాస్ ఇమేజ్ ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం రామ్ చేస్తున్న ప్రయత్నాలకు లింగుస్వామి సినిమా ఎలా తోడ్పడుతుందో చూడాలి