iDreamPost
iDreamPost
నాగ చైతన్య సాయి పల్లవిల ఫస్ట్ టైం కాంబినేషన్లో రూపొందుతున్న లవ్ స్టోరీ కొత్త పోస్టర్ ని నిన్న పండగ సందర్భంగా విడుదల చేశారు. అయితే అందులో కమింగ్ సూన్ అని కానీ థియేటర్లలో రాబోతోందని కానీ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీన్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. పెళ్లి బట్టల్లో పీటల మీద కూర్చుకున్న జంటగా ఇద్దరినీ చూసి సంతోషించారు కానీ రిలీజ్ గురించిన క్లారిటీ లేకపోవడం ఇప్పుడు అయోమయంలో పడేస్తోంది. ఫిదా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఇది కూడా ప్రేమకథనే అయినప్పటికీ మేకింగ్ లో రాజీ పడకుండా లాక్ డౌన్ కు ముందు నుంచే నెలల తరబడి తీస్తూనే ఉన్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం లవ్ స్టోరీకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. తొందరపడి ప్రకటించి ఆ తర్వాత వెనక్కు తీసుకునే బదులు ఓ రెండు నెలలు పరిస్థితిని గమనించి అప్పుడు డిసైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. సంక్రాంతికి ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొంది. సో ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వచ్చినా రాకపోయినా రెడ్, క్రాక్, అరణ్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చేలా ఉన్నాయి. అనవసరమైన కాంపిటేషన్ కు పోయే రోజులు కావివి. అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేక వీలైతే ఫిబ్రవరిలో లేదా ఏకంగా వేసవికి వెళ్లినా పర్లేదు అనే తరహాలో ప్లానింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. అదే జరిగితే ఇప్పట్లో డేట్ చెప్పడం కష్టమే.
ఈ లెక్కన చూస్తే చైతు ఫ్యాన్స్ కి కన్ఫ్యూజన్ తీరేందుకు టైం పట్టేలా ఉంది. మజిలీ సక్సెస్ ని నిలబెట్టుకునే ఉద్దేశంతో నాగ చైతన్య స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే థాంక్ యు కూడా లవ్ ఎంటర్ టైనర్ తరహాలోనే సాగుతుందట. లవ్ స్టోరీ దాదాపుగా పూర్తయినా కూడా ఇంకా సస్పెన్సు ఎందుకంటే పైన చెప్పిన కారణాల కంటే వేరేవి కనిపించడం లేదు. ఓటిటి ఆఫర్లు బాగా వచ్చిన కూడా స్వతహాగా డిస్ట్రిబ్యూటర్లు అయిన నిర్మాత నారంగ్ ఆ ఆఫర్లను తిరస్కరించి థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో లెట్ వెయిట్ అండ్ సి. కాకపోతే కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది.