iDreamPost
android-app
ios-app

లవ్ స్టోరీ రిలీజ్ డేట్ లాక్ ?

  • Published Jul 03, 2021 | 8:10 AM Updated Updated Jul 03, 2021 | 8:10 AM
లవ్ స్టోరీ రిలీజ్ డేట్ లాక్ ?

థియేటర్లు ఎప్పుడు తెరవాలనే విషయం మీద గత కొద్దిరోజులుగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల మూడో వారం నుంచి ఓపెన్ చేయాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఒకవేళ కొత్త సినిమాలు కనక ఆ డేట్ కి సిద్ధంగా లేకపోయినా లేక నిర్మాతలు భయంతో ఆగిపోయినా ముందు వకీల్ సాబ్ లాంటివి వేసి ఆ తర్వాత వారం నుంచి కొత్త కంటెంట్ కోసం ప్రొడ్యూసర్ల మీద ఒత్తిడి తేవాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. వాళ్లకు ఆ కష్టం లేకుండా ఇప్పటికే నిర్మాణ సంస్థలు కొత్త రిలీజ్ డేట్లతో ఆల్రెడీ ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న న్యూస్.

ఇదే కనక జరిగితే ముందు వచ్చే పెద్ద సినిమా లవ్ స్టోరీనే కావొచ్చు. ప్రాధమికంగా జూలై 30ని దీని కోసం లాక్ చేయబోతున్నారట. అప్పటికంతా థియేటర్లకు వంద శాతం ఆక్యుపెన్సీ ఇస్తారన్న నమ్మకంతో ఆసియన్ సంస్థ దానికి తగ్గట్టు ముందస్తు ఏర్పాట్లలో ఉన్నట్టు వినికిడి. అయితే సెకండ్ షోలకు పర్మిషన్లు ఉంటాయా లేదా అనేది కూడా దీని విడుదలలో కీలకం కానుంది. రాత్రి ఆటలు లేకపోతే లవ్ స్టోరీని రిలీజ్ చేయడం కష్టమని గతంలో నిర్మాత సునీల్ నారంగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సో లవ్ స్టోరీ కనక జూలై 30న వచ్చేస్తే ఇక చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు క్యూ కడతాయి

సారంగ దరియా పాట పుణ్యామాని ఇప్పటికే లవ్ స్టోరీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిదా తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది. అన్నింటి కన్నా ఎక్కువగా నాగ చైతన్య సాయి పల్లవిల ఫస్ట్ టైం కెమిస్ట్రీ మీద యూత్ లో చాలా హైప్ ఉంది. వీటిని సరిగ్గా నిలబెట్టుకోగలిగితే లవ్ స్టోరీ అద్భుతాలు చేయండం ఖాయమే. టీమ్ ప్రస్తుతం ట్రైలర్ తో సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యాక దానితో పాటే వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టోరీ వచ్చిన నెలకు టక్ జగదీశ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం

jojobetjojobet girişJojobet Casino Sitesijojobetjojobet giriş adresimarsbahis girişmarsbahismarsbahis giriş