iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ పై మాజీ మంత్రి లోకేష్ ట్విట్స్

సీఎం జగన్ పై మాజీ మంత్రి లోకేష్ ట్విట్స్

ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నేడు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ‘ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైసీపీ నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారు’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.

 “‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటా..అని వైఎస్ జగన్‌ గారు అన్నట్టు నేను తప్పుగా విన్నా. ఆయన నిజమే చెప్పారు. జగన్ గారు అన్నది రాష్ట్రాన్ని‘ముంచే’ ముఖ్యమంత్రి అవుతా అని. అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడిన జగన్ గారు, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రాష్ట్రం నుంచి బయటకు పంపాలని కక్ష కట్టారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు” అని వైఎస్ జగన్‌పై లోకేష్ వరుస ట్వీట్స్ చేశారు.